కెకె మరణవార్తకు నా గుండె పగిలింది : చిరంజీవి

ABN , First Publish Date - 2022-06-01T20:05:37+05:30 IST

రోజు (జూన్ 1) ప్రముఖ గాయకుడు కె.కె (K.K) (కృష్ణ కుమార్ కున్నత్ Krishnakumar Kunnath) కన్నుమూశారు. ఆయన వయసు 53. ఇంత చిన్న వయసులో హఠాత్తుగా మృతి చెందటం సంగీత ప్రియులకు తీరని లోటు. కోల్‌కతాలో లైవ్ పర్ఫార్మెన్స్ ఇస్తూ గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలారు.

కెకె మరణవార్తకు నా గుండె పగిలింది : చిరంజీవి

ఈరోజు (జూన్ 1) ప్రముఖ గాయకుడు కె.కె (K.K) (కృష్ణ కుమార్ కున్నత్ Krishnakumar Kunnath) కన్నుమూశారు.  కోల్‌కతాలో లైవ్ పర్ఫార్మెన్స్ ఇస్తూ గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలారు. దాంతో ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చేందినట్టు వైధ్యులు వెల్లడించారు. కె.కె మృతి పట్ల పలువు సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కెకె  మరణం పట్ల సంతాపం తెలియచేస్తూ ట్వీట్ చేశారు.


‘గాయకుడు కేకే దిగ్భ్రాంతికరమైన మరణంతో నా గుండె పగిలింది. చాలా త్వరగా వెళ్ళిపోయారాయన! అద్భుతమైన గాయకుడు. ఆయన నా కోసం 'ఇంద్ర'లోని 'దాయి దాయీ దామ్మా' పాట పాడారు. ఆయన కుటుంబానికి, సన్నిహితులకు, స్నేహితులకు  నా హృదయపూర్వక సానుభూతి. అతని ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను’.. అని ట్వీట్ చేశారు. అలాగే.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా కెకె మరణంపై ఎమోషనల్ గా స్పందించారు. ‘భారమైన హృదయంతో, కెకె కుటుంబ సభ్యులకు,  అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. మీ స్వరం మా హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది. మీ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను కెకె...’ అంటూ చరణ్ ట్వీట్ చేశారు. 

Updated Date - 2022-06-01T20:05:37+05:30 IST

Read more