సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

ఎంత నెమ్మదస్తుడో ఆయన ఎడిటింగ్ అంత వేగం: Chiranjeevi

ABN, First Publish Date - 2022-07-06T17:22:26+05:30

ప్రముఖ సీనియర్ ఎడిటర్ గౌతమ్ రాజు (Editor Gautham Raju)(68) మృతి చెందారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రముఖ సీనియర్ ఎడిటర్ గౌతమ్ రాజు (Editor Gautham Raju)(68) మృతి చెందారు.  ఈ నేపథ్యంలో ఇండస్ట్రీలోని పలువురు సినీ ప్రముఖుకులు ఆయన మృతి పట్ల సంతాపం తెలిజేశారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ పెట్టారు. గత కొంతకాలంగా గౌతమ్ రాజు అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యారు కూడా. అయితే, మంగళవారం ఒక్కసారిగా ఆరోగ్యం విషమించింది. దీంతో రాత్రి 1.30 గంటలకు కన్నుమూశారు. గౌతమ్ రాజు మరణ వార్త తెలిసి చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు నెలకొన్నాయి.


ఈ నేపథ్యంలో చిరంజీవి తన ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టారు. దీనిలో..'గౌతమ్ రాజు గారి లాంటి గొప్ప ఎడిటర్‌ను కోల్పోవడం దురదృష్టకరం. ఆయన ఎంత సౌమ్యుడో ఎడిటింగ్ అంత వాడి. ఆయన మితభాషి, కానీ ఆయన ఎడిటింగ్ మెళకువలు అపరిమితం. ఎంత నెమ్మదస్తుడో ఆయన ఎడిటింగ్ అంత వేగం. 'చట్టానికి కళ్ళు లేవు' సినిమా నుంచి ఖైదీ నంబర్ 150 వరకు నా ఎన్నో చిత్రాలకు ఎడిటర్‌గా పనిచేసిన గౌతమ్ రాజు లేకపోవడం వ్యక్తిగతంగా నాకు, మొత్తం పరిశ్రమకు పెద్ద లోటు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను'..అని రాసుకొచ్చారు. 


కాగా, ఇదే తరహాలో మరికొంత సినీ తారలు గౌతమ్ రాజు మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నారు. ఆయన ఎడిటర్ గా పని చేస్తున్నారు అంటే దర్శకులకు ఓ భరోసా ఉండేది. జూనియర్ ఎన్టీఆర్ 'ఆది' చిత్రానికి గౌతమ్ రాజు ఎడిటర్ గా నంది అవార్డు సొంతం  చేసుకున్నారు. కిక్, రేసుగుర్రం, గోపాల గోపాల, గబ్బర్ సింగ్, ఖైదీ నెంబర్ 150, బలుపు, అదుర్స్ లాంటి బ్లాక్ బస్టర్స్ చిత్రాలకు ఆయన ఎడిటర్ గా పనిచేశారు. 



Updated Date - 2022-07-06T17:22:26+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!