గర్వించే తండ్రికి కృతజ్ఞత గల కొడుకుని: Chiranjeevi

ABN , First Publish Date - 2022-06-19T18:19:57+05:30 IST

నేడు (జూన్ 19) ఫాదర్స్ డే స్పెషల్ (Fathers Day Special). ఈ సందర్భంగా అందరూ తమ తండ్రులతో కలిసి సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇండియా, అమెరికాతో పాటు పలు దేశాలలో ఫాదర్స్ డేను

గర్వించే తండ్రికి కృతజ్ఞత గల కొడుకుని: Chiranjeevi

నేడు (జూన్ 19) ఫాదర్స్ డే స్పెషల్ (Fathers Day Special). ఈ సందర్భంగా అందరూ తమ తండ్రులతో కలిసి సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇండియా, అమెరికాతో పాటు పలు దేశాలలో ఫాదర్స్ డేను ప్రతీ ఏడాది జూన్ మూడవ వారంలో ఎంతో గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటారు. ప్రతీ ఒక్కరి జీవితంలో తండ్రే మొదటి హీరో, గురువు, మార్గ దర్శకుడు..అన్నీనూ. తన పిల్లల ఎదుగుదల కోసం జీవితంలో వారిని ఉన్నత స్థానానికి తీసుకువచ్చేందుకు ఎల్లవేళలా కంటికి రెప్పలా కాచుకుంటూ ప్రతీ క్షణం బిడ్డల గురించే పరితపించే నాన్న గురించి ఒక్క మాటలో, ఒక్క వాఖ్యంలో చెప్పడం ఏ రకంగానూ కుదరనిపని.


తండ్రి చేసిన త్యాగాలను గుర్తు చేసుకుంటూ తనతో గడిపిన మధుర క్షణాలను నెమరవేసుకుంటూ కృతజ్ఞతలు తెలపడమే నేటి ప్రత్యేకత. ఈ ప్రత్యేకమైన రోజును మన సినీ తారలు కూడా తమ నాన్నలతో గడిపిన క్షణాలను గుర్తుచేసుకుంటూ సోషల్ మీడియాలో ఆసక్తికరంగా పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తన తండ్రి కొణిదెల వెంకట్రావు (Konidela Venkatrao)తో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేశారు. అలాగే, "గర్వించదగిన తండ్రికి కృతజ్ఞత గల కొడుకును కావడం గొప్ప అనుభూతి"!..అంటూ పోస్టులో రాసుకొచ్చారు. ఈ సందర్భంగా అందరికీ ఫాదర్స్ డే విషెస్ తెలిపారు.


చిరంజీవి తండ్రికి కూడా నటన మీద ఆసక్తి ఉండేది. కానీ, పరిస్థుతుల కారణంగా ఆయన కానిస్టేబుల్‌గా జీవనం సాగించారు. అయితే, తన కొడులు (చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్) లను మాత్రం సినీ రంగం వైపే నడిపించారు. ఇప్పటికే 150 సినిమాలను పూర్తి చేసి మెగాస్టార్‌గా అసాధారణమైన పాపులారిటీని సాధించిన చిరు, తన పేరు మీద చారిటబుల్ ట్రస్ట్ నెలకొల్పి రక్తదానం, నేత్రదానం లాంటి మరెన్నో సేవా కార్యక్రామాలను నిర్వహిస్తున్నారు. 


సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) కూడా తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ (Super Star Krishna)తో ఉన్న ఓ ఫొటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఇందులో .."మీరు నాకు ఉదాహరణ, తండ్రి అంటే ఏమిటో చూపించారు. మీరు లేకుండా నేను లేను..హ్యాపీ ఫాదర్స్ డే నాన్న"..అని పేర్కొన్నారు. సినిమాల ఎంపికలో మహేశ్ తన తండ్రి కృష్ణనే అనుసరిస్తూ వస్తున్నారు. హిట్ ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా ఎక్కువగా సమాజిక అంశం ఉండే కథలతో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అంతేకాదు, ఎంతోమంది చిన్నారులకు ప్రాణం పోశారు. తన సొంత ఊరు బుర్రిపాలెంను దత్తత తీసుకొని అక్కడివారికి అన్నీ సదుపాయాలు సమకూర్చుతున్నారు. కాగా, వీరితో పాటు మరికొందరు సెలబ్రిటీస్ కూడా తమ తండ్రులతో ఉన్న బంధం గురించి పోస్టులు పెట్టారు. 















Updated Date - 2022-06-19T18:19:57+05:30 IST