సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Chiranjeevi Help: ప్రాణాపాయ స్థితిలో అభిమాని.. మెగా అభయం

ABN, First Publish Date - 2022-08-16T23:29:51+05:30

మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi)మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ఎవరికి ఆపద వచ్చినా సహాయం చేయడానికి ముందుండే ఆయన మరో అభిమానికి అండగా నిలిచారు. చిరంజీవి అభిమాని దొండపాటి చక్రధర్‌ కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. చక్రధర్‌ (Fan chakradhar)ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న చిరు మెరుగైన వైద్యం కోసం చక్రధర్‌ని హైదరాబాద్‌ తరలించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi)మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ఎవరికి ఆపద వచ్చినా సహాయం చేయడానికి ముందుండే ఆయన మరో అభిమానికి అండగా నిలిచారు. చిరంజీవి అభిమాని దొండపాటి చక్రధర్‌ కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. చక్రధర్‌ (Fan chakradhar)ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న చిరు మెరుగైన వైద్యం కోసం చక్రధర్‌ని హైదరాబాద్‌ తరలించారు. ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో జాయిన్‌ చేయించారు. అంతేకాదు సోమవారం సాయంత్రం  చక్రధర్‌ను కలిసి పరామర్శించారు. అండగా ఉంటానని ధైర్యం చెప్పారు. అలాగే అక్కడి వైద్యులతో మాట్లాడి పరిస్థితి తెలుసుకుని మెరుగైన వైద్యం అందించాలని కోరారు. చక్రధర్‌కు అండగా ఉంటామని ఆయన కుటుంభానికి మెగాస్టార్‌ అభయమిచ్చారు. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గానికి చెందిన దొండపాటి చక్రధర్‌ తన హీరో బాటలోనే సేవా కార్యక్రమాలు చేయడానికి ముందుంటారు. (Chiranjeevi helps to fan)




Updated Date - 2022-08-16T23:29:51+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!