బన్నీకి చిరు స్పెషల్ విషెస్..

ABN , First Publish Date - 2022-04-08T18:18:50+05:30 IST

నేడు (ఏప్రిల్ 8) ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 40వ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు తన మావయ్య, మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ద్వారా ప్రత్యేకంగా బర్త్ డే విషెస్ తెలుపుతూ పోస్ట్ పెట్టారు.

బన్నీకి చిరు స్పెషల్ విషెస్..

నేడు (ఏప్రిల్ 8) ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 40వ పుట్టినరోజు. ఈ సందర్భంగా తన మావయ్య, మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ద్వారా ప్రత్యేకంగా బర్త్ డే విషెస్ తెలుపుతూ పోస్ట్ పెట్టారు. ఇందులో చిరంజీవి.."హ్యాపీ బర్త్ డే బన్నీ..నీ కృషి, ఏకాగ్రత విజయాన్ని అందిస్తుంది. ఈ ల్యాండ్‌మార్క్ పుట్టినరోజు (40)ను గుర్తుండిపోయేలా చేసుకోవాలి"..అంటూ రాసుకొచ్చారు. ఇక అల్లు అర్జున్ ఈ పుట్టినరోజు వేడుకను తన కుటుంబ సభ్యుల మధ్య గ్రాండ్‌గా యూరప్‌లో జరుపుకోబోతున్నాడు. ఈరోజు అక్కడికి వెళుతూ ఫ్యామిలీతో పాటుగా ఏయిర్‌పోర్ట్‌లో మీడియావారికి కనిపించాడు బన్నీ. ఈ సమయంలో తీసిన కొన్ని పిక్స్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక మెగాస్టార్‌తో పాటుగా మెగా హీరో సాయి ధరమ్ తేజ్, విక్టరీ వెంకటేశ్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, శ్రీకాంత్, కోన వెంకట్ సహా పలువురు సినీ తారలు ఐకాన్ స్టార్‌కు సోషల్ మీడియా ద్వారా స్పెషల్ విషెస్ చెబుతున్నారు. కాగా, యూరప్ నుంచి తిరిగి రాగానే బ్లాక్ బస్టర్ సీక్వెల్ పుష్ప: ది రూల్ మూవీ షూటింగ్ కోసం రెడీ అవుతాడు.

Updated Date - 2022-04-08T18:18:50+05:30 IST

Read more