సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

శ్రీదేవి బుగ్గల్లాంటి గుత్తి వంకాయ.. ఆయన మాటల్ని గుర్తు చేసుకున్న Chiranjeevi

ABN, First Publish Date - 2022-06-28T00:12:42+05:30

‘‘రావు గోపాలరావుతో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది. ఆయన్ని నేను చిన్నమామయ్య అని పిలిచేవాడిని. మా మామయ్య అల్లు రామలింగయ్య, రావు గోపాలరావుగారిది అన్నదమ్ముల అనుబంధం అందుకే ఆయన్ను అలా పిలిచేవాడిని.. ఆయనకూ నేనంటే ఎంతో ప్రేమ. నటనలో ఆయన టైమింగ్‌ అంటే నాకు ఎంతో ఇష్టం. ఇప్పుడు ఆయన తనయుడు రావు రమేశ్‌ ఎంచుకుంటున్న పాత్రలు, అతని చూస్తే ఎంతో ముచ్చటేస్తుంది’’ అని చిరంజీవి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘‘రావు గోపాలరావుతో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది. ఆయన్ని నేను చిన్నమామయ్య అని పిలిచేవాడిని. మా మామయ్య అల్లు రామలింగయ్య, రావు గోపాలరావుగారిది అన్నదమ్ముల అనుబంధం అందుకే ఆయన్ను అలా పిలిచేవాడిని.. ఆయనకూ నేనంటే ఎంతో ప్రేమ. నటనలో ఆయన టైమింగ్‌ అంటే నాకు ఎంతో ఇష్టం. ఇప్పుడు ఆయన తనయుడు రావు రమేశ్‌ (Rao ramesh)ఎంచుకుంటున్న పాత్రలు, అతని చూస్తే ఎంతో ముచ్చటేస్తుంది’’ అని చిరంజీవి (Chiranjeevi)అన్నారు. గోపీచతంద్‌ హీరోగా మారుతి దర్శకత్వం వహించిన ‘పక్కా కమర్షియల్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రావుగోపాల రావుతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. (Pakka commercial movie)


‘‘రావుగోపాలరావుగారికి నేనకంటే ఎంతో ప్రేమ. తరచూ ఇంటి నుంచి నా కోసం భోజనం తీసుకొచ్చేవారు. గుత్తి వంకాయ కూరని శ్రీదేవి బుగ్గల్లా, చికెన్‌ని మరోవిధంగా పోల్చి చెప్పి.. తినేవరకూ ఊరుకునేవారు కాదు. అత్తయ్య  ప్రత్యేకంగా తులసిచారు చేసి పంపేవారు. అదంటే నాకు చాలా ఇష్టం. ఆయన వారసుడిగా రావు రమేశ్‌ విభిన్నమైన పాత్రలు పోషిస్తూ గొప్ప నటుడు అయ్యారు. తండ్రి స్థానాన్ని భర్తీ చేస్తూ, అద్భుతమైన పాత్రలు చేస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు. ఆయన ఉన్నత స్థానానికి వెళ్లాలని, అలాగే నా సినిమాల్లో కూడా నటించాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు. చిరంజీవి మాటలతో రావురమేశ్‌ భావోద్వేగానికి లోనయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అవుతోంది. అలాగే చిరు గోపీచంద్‌ తండ్రి టి. కృష్ణతో ఉన్న అనుబంధం గురించి కూడా ఈ వేదికపై పంచుకున్నారు. గోపీచంద్‌, రాశీఖన్నా జంటగా మారుతి దర్శకత్వం వహించిన ‘పక్కా కమర్షియల్‌’ చిత్రం జులై ఒకటో తేదీన విడుదల కానుంది.  (Chiranjeevi speech about Rao gopalarao). 

Updated Date - 2022-06-28T00:12:42+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!