సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

God Father: చిరు ఇంట మెగా సందడి... సల్మాన్‌ విషెస్‌!

ABN, First Publish Date - 2022-10-06T23:14:25+05:30

మెగా కాంపౌండ్‌లో విజయదశమి వేడుకలు ఘనంగా జరిగాయి. పండుగ రోజులు చిరంజీవి నటించిన ‘గాడ్‌ఫాదర్‌’ చిత్రం విడుదల కావడం, బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకోవడంతో ఈ పండుగ చిరు ఇంట మరింత ప్రత్యేకత సంతరించుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మెగా కాంపౌండ్‌లో విజయదశమి వేడుకలు ఘనంగా జరిగాయి. పండుగ రోజులు చిరంజీవి నటించిన ‘గాడ్‌ఫాదర్‌’(god father) చిత్రం విడుదల కావడం, బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకోవడంతో ఈ పండుగ చిరు ఇంట మరింత ప్రత్యేకత సంతరించుకుంది. కుటుంబ సభ్యుల సమక్షంలో చిరంజీవి – సురేఖ దంపతులు అమ్మవారికి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి మాతృమూర్తి అంజనా దేవి, రామ్‌చరణ్‌(Ram charan), ఉపాసన, సుస్మిత, శ్రీజ తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. రామ్‌చరణ్‌, ఉపాసన అంజనా దేవితో ఆప్యాయంగా దిగిన ఫొటోలను ఉపాసన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. (God father success celebs)


అలాగే ‘గాడ్‌ఫాదర్‌’ సక్సెస్‌ సెలబ్రేషన్స్‌ బుధవారం సాయంత్రం చిరు ఇంట నిర్వహించారు చిత్ర నిర్మాతలు.  దర్శకుడు మోహన్‌రాజా, నిర్మాతలు ఆర్‌.బి.చౌదరి, ఎన్వీప్రసాద్‌, సత్యదేవ్‌, తమన్‌.. చిరంజీవికి పుష్పగుచ్ఛాన్ని అందించి శుభాకాంక్షలు తెలిపారు. మైత్రిమూవీ మేకర్స్‌ నిర్మాతలు, హరీశ్‌ శంకర్‌, మెహర్‌ రమేశ్‌ కూడా చిరు ఇంట జరిగిన సక్సెస్‌ సెలబ్రేషన్స్‌లో భాగమయ్యారు. 


చిరు సర్‌.. కంగ్రాట్స్‌...

‘గాడ్‌ఫాదర్‌’ చిత్రంలో అతిథిగా కీలక పాత్ర పోషించిన బాలీవుడ్‌ హీరో సల్మాన్‌ఖాన్‌ సినిమా విజయాన్ని ఉద్దేశించి  ఓ వీడియో పోస్ట్‌ చేశారు. ‘చిరు సర్‌ ఐ లవ్‌ యూ. సినిమా పెద్ద హిట్‌ అయిందని విన్నాను. కంగ్రాట్స్‌. భగవంతుడి ఆశీసులు మీకుండాలి. వందేమాతరం’’ అని వీడియోలో పేర్కొన్నారు సల్మాన్‌ ఖాన్‌. 



కల నిజమైన వేళ: మోహన్‌రాజా

అనంతరం దర్శకుడు మోహన్‌రాజా మాట్లాడుతూ ‘‘నా కల నిజమైన క్షణమిది. సినిమా విడుదలైన ప్రతి చోట పాజిటివ్‌ టాక్‌ నడుస్తోంది. గడిచిన కొన్ని నెలల్లో ఇలాంటి ఫీడ్‌బ్యాక్‌ వినలేదు. సినిమా విడుదలకు ముందు కాస్త భయపడ్డాను. కానీ, ఏడాదిన్నర కష్టానికి మంచి ప్రతిఫలాన్ని దక్కింది. ఈ హిట్‌ అదృష్టంగా భావిస్తున్నా’’ అని అన్నారు. 





Updated Date - 2022-10-06T23:14:25+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!