సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

GodFather: ఆకసం పట్టని నామధేయం.. ఆటగా ఆడినా రాజకీయం

ABN, First Publish Date - 2022-10-03T23:52:37+05:30

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) హీరోగా మోహన్ రాజా (Mohan Raja) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గాడ్‌ఫాదర్’ (God Father). ఈ సినిమా ఇంకొన్ని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) హీరోగా మోహన్ రాజా (Mohan Raja) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గాడ్‌ఫాదర్’ (God Father). ఈ సినిమా ఇంకొన్ని గంటలలో విడుదలకాబోతోన్న విషయం తెలిసిందే. ‘ఆచార్య’ (Acharya) ఫ్లాప్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో.. ఈ సినిమా విజయం సాధించడం మెగాస్టార్‌కి ఎంతో ముఖ్యం. అంతేకాకుండా ఈ సినిమాలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ (Salman Khan) నటించడం, బాలీవుడ్‌లో కూడా ఈ సినిమాని విడుదల చేస్తుండటంతో.. సినిమాకు సంబంధించిన ప్రతి విషయాన్ని చిరు దగ్గరుండి చూసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో ఫైనల్ కాపీ చూసిన తర్వాత.. చాలా హ్యాపీగా ఫీలైనట్లుగా.. రీసెంట్‌గా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కూడా చిరంజీవి (Chiranjeevi) వెల్లడించారు. దీంతో సినిమాపై భారీగానే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలోనే.. సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి (Saraswati Putra Ramajogayya Sastry) ఇచ్చిన స్పీచ్.. ఈ సినిమా కోసం ఆయన రాసిన పాటలపై ఇచ్చిన వివరణ.. మెగాభిమానులనే కాదు.. ప్రేక్షకులని కూడా ఈ సినిమా వైపు చూసేలా చేశాయి. స్టేజ్‌పై ఆయన పాడిన ‘ఏకోరాజా విశ్వరూపధారి’ పాట ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. ఆ పాటని ఎప్పుడెప్పుడు మేకర్స్ విడుదల చేస్తారా? అని అభిమానులు వేచి చూస్తున్నారు. ఆ ఎదురుచూపులు ఫలించాయి. తాజాగా ఈ పాటను మేకర్స్ విడుదల చేశారు. 


పాట లిరికల్ వీడియో విడుదల కంటే ముందే.. ఈ పాటకు సంబంధించిన లిరికల్ షీట్‌ను రామజోగయ్య శాస్త్రి తన ట్విట్టర్ వేదికగా విడుదల చేశారు. ఆయన చేసిన ఈ పోస్ట్‌కు నెటిజన్ల కామెంట్స్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ‘‘ఒక 20 సినిమాలకు సరిపోయే ఎలివేషన్ లైన్స్ అన్నీ ఒక్క పాటలో కుదించారు సార్’’ అంటూ మెగాభిమానులు శాస్త్రిగారికి ధన్యవాదాలు తెలుపుతున్నారు. రామజోగయ్య శాస్త్రి షేర్ చేసిన లిరికల్ షీట్ ఇదే..


సంగీత దర్శకుడు థమన్ కూడా ఈ పాట కోసం ప్రాణం పెట్టినట్లుగా.. ఆ పాట వింటుంటే తెలుస్తోంది. ‘గాడ్‌ఫాదర్’ టైటిల్‌ సాంగ్‌గా మేకర్స్ ఈ పాటను వదిలారు. ప్రస్తుతం ఈ లిరికల్ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 



Updated Date - 2022-10-03T23:52:37+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!