Chiranjeevi: నాకు నేనే సెల్ఫ్‌ డబ్బా కొట్టాను!

ABN , First Publish Date - 2022-10-30T01:28:43+05:30 IST

చిరంజీవి తన గురించి తానే సెల్ఫ్‌ డబ్బా కొట్టుకున్నారట. అది కూడా ఆయన ఇంట్లోనే. ఈ విషయాన్ని చిరునే స్వయంగా వెల్లడించారు. సీనియర్‌ సినీ జర్నలిస్ట్‌ ప్రభు రాసిన ‘శూన్యం నుంచి శిఖరాగ్రం వరకూ’ పుస్తకాన్ని చిరంజీవి ఆవిష్కరించారు.

Chiranjeevi: నాకు నేనే సెల్ఫ్‌ డబ్బా కొట్టాను!

చిరంజీవి (Chiranjeevi)తన గురించి తానే సెల్ఫ్‌ డబ్బా కొట్టుకున్నారట(self dabba). అది కూడా ఆయన ఇంట్లోనే. ఈ విషయాన్ని చిరునే స్వయంగా వెల్లడించారు. సీనియర్‌ సినీ జర్నలిస్ట్‌ ప్రభు రాసిన ‘శూన్యం నుంచి శిఖరాగ్రం వరకూ’ పుస్తకాన్ని చిరంజీవి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జర్నలిస్ట్‌లతో ఆయనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తమిళంలో పోలిస్తే తెలుగు సినిమా జర్నలిజం ఆరోగ్యవంతంగా ఉందని, నెగిటీవ్‌ విషయాలు, గాసిప్పులు రాయరని, ఈ విషయంలో జర్నలిస్ట్‌లకు హ్యాట్సాఫ్‌ అని చిరు కొనియాడారు. ’’అప్పట్లో ఓ తమిళ పత్రికలో కిస్‌ కిస్‌ అనే కాలమ్‌ ఉండేది. అందులో అన్నీ అభూత కల్పనలు రాసేవారు.  అవి చదివి హీరోయిన్లు బాధపడ్డ సందర్భాలున్నాయి. తెలుగులో అలాంటి వాతావరణం లేదు. అప్పుడప్పుడూ చిన్నచిన్న విషయాలు ఇక్కడ కూడా జరుగుతుంటాయి. వాటిని పెద్దగా పట్టించుకోవలసిన అవసరం లేదు’’ అని చిరంజీవి అన్నారు. ఈ తరానికి పాతతరం నటీనటుల గొప్పదనం గురించి చెప్పాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. 


తన ఇంట్లో తనకు జరిగిన ఓ విషయాన్ని ఆయన సరదాగా చెప్పుకొచ్చారు. ‘‘మా ఇంట్లో నా మనవలు, మనవరాళ్లూ ఎప్పుడు చూసినా చరణ్‌, తేజ్‌, వైష్ణవ్‌ సినిమాలు, పాటలే  చూస్తున్నారు. నా సినిమాల గురించీ, నా పాటల  గురించీ ఎవరూ పట్టించుకోరు. దాంతో నా మనసులో ఒకరకమైన జెలసీ ఫీలింగ్‌ వస్తుంది. అప్పుడు వాళ్లందరినీ కూర్చొబెట్టుకుని నా గురించి నేనే సెల్ఫ్‌ డబ్బా కొట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. లాక్‌డౌన్‌లో వాళ్లందరికీ నా పాటలు, సినిమాలు చూపించా. ‘భయ్యా’ ఇది నువ్వా..? అంటూ వాళ్లంతా ఆశ్చర్యపోయారు. నా వయసు పెరిగినప్పటికీ పిల్లలంతా నన్ను ‘భయ్యా’ అంటుంటారు. వాళ్లు అలా పిలవడం నాకు ఆనందమే! అలా నా గురించి నేనే నా ఇంట్లో సెల్ఫ్‌ డబ్బా కొట్టుకోవాల్సివచ్చింది. లక్‌ ఏంటంటే వాళ్లందరికీ ‘గాడ్‌ ఫాదర్‌’ సినిమా నచ్చింది. ఒక్కొక్కరూ నాలుగుసార్లు చూశారట’’ అని చిరంజీవి సరదాగా చెప్పుకొచ్చారు. 



Updated Date - 2022-10-30T01:28:43+05:30 IST