Chirajeevi: డియర్ సామ్.. సవాళ్లని ఎదుర్కొన్నే సత్తా నీకు ఉంది
ABN, First Publish Date - 2022-10-30T19:38:47+05:30
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) మైయోసిటిస్ అనే అరుదైన వ్యాధితో బాధ పడుతున్న విషయం తెలిసిందే..
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) మైయోసిటిస్ అనే అరుదైన వ్యాధితో బాధ పడుతున్న విషయం తెలిసిందే. ఆ వ్యాధి గురించి స్వయంగా సమంతనే సోషల్ మీడియా వేదిక తెలియజేసింది. దీనిపై ఎంతోమంది టాలీవుడ్ (Tollywood) స్టార్ స్పందిస్తూ సమంతకి బాసటగా నిలుస్తూ ఆమె ధైర్యం చెప్పారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి (Chirajeevi) కూడా సోషల్ మీడియా వేదికగా సమంతకి ధైర్యంగా ఉండమంటూ ట్వీట్ చేశాడు.
ఆయన చేసిన ట్వీట్‌లో.. ‘ప్రియమైన సమంత.. మనలోని నిజమైన శక్తులని బయటికి తీసుకురావడానికి.. ఎప్పటికప్పుడూ ఇలాంటి సమస్యలు వస్తూనే ఉంటాయి. నువ్వు బలమైన సంకల్పంతో ఉన్న అద్భుతమైన వ్యక్తివి. త్వరలోనే ఈ సమస్యని కూడా అధిగమిస్తావని నాకు తెలుసు. ఆ ధైర్యం, నమ్మకం నీకు కలగాలని కోరుకుంటున్నా. దేవుడు నీతో ఉన్నాడు’ అని రాసుకొచ్చాడు.
కాగా ఇంతకుముందే సమంత తనకి వచ్చిన వచ్చిన అరుదైన వ్యాధి గురించి వెల్లడిస్తూ ఓ ట్వీట్ చేసింది. అందులో.. ‘‘గత కొన్ని నెలలుగా నేను అనారోగ్యంతో బాధపడుతున్నా. ‘మయోసిటిస్’(Myositis) అనే ఆటో ఇమ్యూనిటీ (samantha autoimmune condition) సమస్యకు చికిత్స తీసుకుంటున్నా. ఈ విషయాన్ని ఎప్పుడో తెలియజేయాలనుకున్నా. కాస్త ఆలస్యమైంది. ఇప్పుడు నా ఆరోగ్యం నిలకడగా ఉంది. త్వరలోనే ఈ సమస్య నుంచి పూర్తిగా కోలుకుంటానని వైద్యులు నమ్మకంగా చెప్పారు. జీవితంలో అటు మానసికంగా, ఇటు శారీరకంగా మంచి, చెడు రోజులను చూశాను. ఇక మరో రోజు కూడా ఇలా ఉండలేను. ఎలాగో క్షణాలు గడుస్తున్నాయి. నేను పూర్తిగా కోలుకునే రోజు అతి దగ్గరలో ఉంది. ఐ లవ్ యూ’’ అని సమంత రాసుకొచ్చింది.