చిల్‌ మారో.. చిల్‌ మారో

ABN , First Publish Date - 2022-06-01T11:29:24+05:30 IST

నితిన్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘మాచర్ల నియోజకవర్గంలో’. కృతిశెట్టి కథానాయిక. కేథరిన్‌ థెస్రా ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు...

చిల్‌ మారో.. చిల్‌ మారో

నితిన్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘మాచర్ల నియోజకవర్గంలో’. కృతిశెట్టి కథానాయిక. కేథరిన్‌ థెస్రా ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఎం.ఎస్‌.రాజశేఖర్‌ రెడ్డి దర్శకుడు. సుధాకర్‌ రెడ్డి, నికితారెడ్డి నిర్మాతలు. ఈ చిత్రంలోని ‘చిల్‌ మారో... చిల్‌ మారో..’ అనే గీతాన్ని ప్రముఖ కథానాయకుడు కమల్‌ హాసన్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్రబృందం కొత్త పోస్టర్‌ ని కూడా విడుదల చేసింది. ఆగస్టు 12న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. ‘‘కమర్షియల్‌ హంగులన్నీ కలగలిపిన చిత్రమిది. సిద్దార్థ్‌ రెడ్డి ఐఏఎస్‌గా నితిన్‌ కనిపించనున్నారు. ఆయన కెరీర్‌లో ఇప్పటి వరకూ.. ఈ తరహా పాత్ర పోషించలేదు. మాస్‌, యాక్షన్‌ అంశాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చామ’’ని దర్శకుడు తెలిపారు. సంగీతం: మహతి స్వర సాగర్‌. 


Updated Date - 2022-06-01T11:29:24+05:30 IST

Read more