సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Rajendra prasad: చంద్ర సిద్థార్థ సోదరుడు ఇకలేరు!

ABN, First Publish Date - 2022-08-20T01:37:59+05:30

ప్రముఖ ఛాయాగ్రాహకుడు, దర్శక – నిర్మాత రాజేంద్ర ప్రసాద్‌ ఇకలేరు. శుక్రవారం ఆయన తుదిశ్వాస విడిచారు. విమర్శకుల ప్రశంసలు, ప్రేక్షకుల మన్ననలు అందుకున్న ‘ఆ నలుగురు’ సహా పలు తెలుగు చిత్రాలకు దర్శకత్వం వహించిన చంద్ర సిద్థార్థకు ఈయన సోదరుడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రముఖ ఛాయాగ్రాహకుడు, దర్శక – నిర్మాత రాజేంద్ర ప్రసాద్‌ (Rajendra prasad)ఇకలేరు.  శుక్రవారం ఆయన తుదిశ్వాస విడిచారు. విమర్శకుల ప్రశంసలు, ప్రేక్షకుల మన్ననలు అందుకున్న ‘ఆ నలుగురు’ (Aa naluguru)సహా పలు తెలుగు చిత్రాలకు దర్శకత్వం వహించిన చంద్ర సిద్థార్థకు  (Chandra siddharth)ఈయన సోదరుడు. 

తెలుగు సినిమా 'నిరంతరం' (1995)కు రాజేంద్ర ప్రసాద్ దర్శక నిర్మాత రచయిత. 'నిరంతరం' సినిమా మలేషియాలోని కైరో చలన చిత్రోత్సవాలకు ఎంపిక అయ్యింది. పలువురి ప్రశంసలు అందుకుంది. హాలీవుడ్‌లో 'మన్ విమన్ అండ్ ది మౌస్', 'రెస్డ్యూ - వేర్ ది ట్రూత్ లైస్' 'ఆల్ లైట్స్, నో స్టార్స్' చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆయన దర్శకత్వం వహించిన సినిమాలు అన్నిటికీ ఆయనే సినిమాటోగ్రఫీ, రైటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. తెలుగులో 'మేఘం', 'హీరో' సహా పలు చిత్రాలకు రాజేంద్ర ప్రసాద్ సినిమాటోగ్రాఫర్ గా సేవలు అందించారు. హిందీ సినిమాలు కూడా చేశారు. రాజేంద్ర ప్రసాద్ ముంబైలో స్థిరపడ్డారు. ఆయన మృతి పట్ల చిత్రసీమ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.


Updated Date - 2022-08-20T01:37:59+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!