ముగిసిన చలపతిరావు అంత్యక్రియలు

ABN , First Publish Date - 2022-12-29T01:21:12+05:30 IST

ఆదివారం ఉదయం గుండెపోటుతో కన్ను మూసిన సీనియర్‌ నటుడు చలపతిరావు అంత్యక్రియలు బుధవారం ముగిశాయి...

ముగిసిన చలపతిరావు అంత్యక్రియలు

ఆదివారం ఉదయం గుండెపోటుతో కన్ను మూసిన సీనియర్‌ నటుడు చలపతిరావు అంత్యక్రియలు బుధవారం ముగిశాయి. అమెరికాలో స్థిర పడిన ఆయన కుమార్తెలు శ్రీదేవి, మాలిని హైదరాబాద్‌కు చేరుకొన్న తర్వాత అంతిమ సంస్కారాలు నిర్వహించారు. జూబ్లీ హిల్స్‌లోని మహా ప్రస్థానంలో చలపతిరావు కుమారుడు రవిబాబు అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంచు మనోజ్‌, సురేశ్‌బాబు, బండ్ల గణేశ్‌, బోయపాటి శ్రీను, శ్రీవాస్‌, బి.గోపాల్‌, రఘుబాబు, కాశీ విశ్వనాథ్‌ తదితరులు హాజరయ్యారు.

రాయదుర్గం (ఆంధ్రజ్యోతి)

Updated Date - 2022-12-29T01:21:15+05:30 IST