Chiranjeevi: ఆ సహృదయం పేరు మహేశ్‌!

ABN , First Publish Date - 2022-08-09T19:19:03+05:30 IST

మంగళవారం మహేశ్‌ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. టాలీవుడ్‌, బాలీవుడ్‌ సెలబ్రిటీలతోపాటు అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా మహేశ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవి ట్విట్టర్‌ వేదికకు మహేశ్‌కు విషెస్‌ చెప్పారు.

Chiranjeevi: ఆ సహృదయం పేరు మహేశ్‌!

మంగళవారం మహేశ్‌ (Happy birthday Mahesh babu) పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. టాలీవుడ్‌, బాలీవుడ్‌ సెలబ్రిటీలతోపాటు అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా మహేశ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవి ట్విట్టర్‌ వేదికకు మహేశ్‌కు విషెస్‌ చెప్పారు. ‘‘ఎందరో చిన్నారులకు గుండె ఆపరేషన్‌ చేయించిన సహృదయం పేరు మహేశ్‌ బాబు. భగవంతుడు అతనికి మరింత శక్తిని, విజయాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ అని మహేశ్‌తో దిగిన ఫొటోను షేర్‌ చేశారు. (HBD mahesh)


చిన్నోడా నువ్వు ఎప్పుడూ నవ్వుతూ ఉండాలని కోరుకుంటున్నా. హ్యాపీ బర్త్‌డే. 

– వెంకటేశ్‌. (Venkatesh)


‘‘పుట్టినరోజు శుభకాంక్షలు మహేశ్‌ అన్నా. నువ్వెప్పుడూ సంతోషంగా ఉండాలని, విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నా’’

– ఎన్టీఆర్‌. (NTR)


‘‘నీదైన చరిష్మా, స్టైల్‌తో అలరిస్తుంటావ్‌. నీ ప్రయాణాన్ని ఇలానే కొనసాగిస్తూ, ఎందరికో స్ఫూర్తిగా నిలవాలని కోరుకుంటున్నా. నువ్వు నటించిన ‘పోకిరి’ విడుదలై 16 ఏళ్లైనా ఇప్పటికీ ఫ్రెష్‌గానే ఉంది. నిర్మాతగా గర్విస్తున్నా’’

- మంజుల (మహేశ్‌ సోదరి)


‘‘హ్యాపీ బర్త్‌ డే మహేశ్‌ బాబు. మీరు ఆనందంగా ఉండాలి. మరిన్ని సక్సెస్‌లు సాధించాలి’’ అని ఆకాంక్షిస్తున్నా’’

– మమ్ముట్టి.


‘‘హ్యాపీ బర్త్‌డే మహేశ్‌ సర్‌. ‘మేజర్‌’ సినిమా ద్వారా మీ లవ్‌, సపోర్ట్‌ దక్కినందుకు చాలా ఆనందంగా ఉంది. మీరు మాకు స్ఫూర్తి’’ 

– అడివి శేష్‌. 


హీరో రామ్‌. తరణ్‌ ఆదర్శ్‌, సంపత్‌ నంది, నమ్రతా శిరోద్కర్‌, రవీనా టాండన్‌. రితేశ్‌ దేశ్‌ముఖ్‌, అవికాగోర్‌, శీను వైట్ల, అనిల్‌ రావిపూడి, కోన వెంకట్‌, సుధీర్‌ వర్మ, వంశీ పైడిపల్లి తదితరులతోపాటు, శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్‌, ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌, సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్‌, మైత్రీ మూవీ మేకర్స్‌ తదితర నిర్మాణ సంస్థలు మహేశ్‌కు విషెస్‌ తెలిపాయి. 





















Updated Date - 2022-08-09T19:19:03+05:30 IST