రవితేజతో కేథరిన్‌?

ABN , First Publish Date - 2022-03-27T06:17:02+05:30 IST

చిరంజీవి కథానాయకుడిగా బాబి దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. రవితేజ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు...

రవితేజతో కేథరిన్‌?

చిరంజీవి కథానాయకుడిగా బాబి దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. రవితేజ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయనకు జోడీగా కేథరిన్‌ థెరిస్సాని ఎంచుకున్నట్టు తెలుస్తోంది. ‘సరైనోడు’ హిట్‌ తరవాత కేథరిన్‌ ఆ అవకాశాన్ని సరిగా వాడుకోలేదు. అయితే ఇప్పుడు ఆమెకు మళ్లీ అవకాశాలు వస్తున్నాయి. నితిన్‌ సినిమా ‘మాచర్ల నియోజకవర్గం’లో తానో కథానాయికగా నటిస్తున్నారు. ఆ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈలోగా కేథరిన్‌కి మరో అవకాశం దక్కినట్టైంది. చిరు సోదరుడిగా రవితేజ నటిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. రవితేజ కూడా సెట్లో అడుగుపెట్టారని, ప్రస్తుతం చిరంజీవి, రవితేజ, కేథరిన్‌లపై కీలకమైన సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారని టాక్‌.


Updated Date - 2022-03-27T06:17:02+05:30 IST