కృష్ణ సాయం మరువలేను
ABN , First Publish Date - 2022-11-17T09:32:15+05:30 IST
కృష్ణ భౌతికకాయానికి సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కృష్ణ పార్దివదేహాన్ని చూసి భావోద్వేగానికి గురయి, కంటతడిపెట్టుకున్నారు...

కృష్ణ భౌతికకాయానికి సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కృష్ణ పార్దివదేహాన్ని చూసి భావోద్వేగానికి గురయి, కంటతడిపెట్టుకున్నారు. మహేశ్‌బాబును హృదయానికి హత్తుకొని ఓదార్చారు. ‘ఏలూరులో నేను, కృష్ణ ఒకే కాలేజీలో చదువుకున్నాం. నా కంటే కొన్నేళ్లు ముందుగా ఆయన ఇంటర్మీడియట్ కోసం చేరారు. నేను గ్రాడ్యుయేషన్ కోసం చేరాను. తెల్ల కాగితం వంటి వ్యక్తి ఆయన. మంచి మనిషి. నేను నటుడిగా రాణించడంలో కృష్ణ చేసిన సాయం మరువలేను. . దాదాపు 50 చిత్రాల్లో ఇద్దరం కలసి నటించాం, కృష్ణ మరణవార్తను జీర్ణించుకోలేకపోతున్నా’ అని బాధగా చెప్పారు.