C Kalyan: అది అట్టర్ ఫ్లాఫ్ షో.. ఎంత పెద్ద హిట్లు ఇచ్చినా.. వారు జీరోలే!

ABN , First Publish Date - 2022-12-08T23:51:38+05:30 IST

కీడు చేసే గుణం వున్న వాళ్ళు సినిమా ఇండస్ట్రీలో ఎంత పెద్ద హిట్లు ఇచ్చిన వారైనా.. ఫైనల్‌గా జీరోలుగానే వెళ్లారు కానీ ఎవరూ హీరోగా వెళ్ళలేదు’’ అన్నారు తెలుగు చలనచిత్ర..

C Kalyan: అది అట్టర్ ఫ్లాఫ్ షో.. ఎంత పెద్ద హిట్లు ఇచ్చినా.. వారు జీరోలే!

కీడు చేసే గుణం వున్న వాళ్ళు సినిమా ఇండస్ట్రీలో ఎంత పెద్ద హిట్లు ఇచ్చిన వారైనా.. ఫైనల్‌గా జీరోలుగానే వెళ్లారు కానీ ఎవరూ హీరోగా వెళ్ళలేదు’’ అన్నారు తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి అధ్యక్షులు, నిర్మాత సి. కళ్యాణ్ (C Kalyan). శుక్రవారం ఆయన పుట్టినరోజు సందర్భంగా గురువారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రీసెంట్‌గా నెలరోజుల పాటు చేసిన షూటింగ్స్ బంద్, సంక్రాంతికి విడుదల కాబోయే సినిమాల థియేటర్స్ విషయంలో జరుగుతున్న రచ్చపై ఆయన మాట్లాడారు.


ఆయన మాట్లాడుతూ.. 30 రోజుల పాటు షూటింగ్స్ ఆపడం (Shooting Bandh) వల్ల ఎటువంటి ప్రయోజనం చేకూరలేదు. అది అట్టర్ ఫ్లాఫ్ షో.  చిన్న సినిమాల నిర్మాతలకు విడుదల రోజున చాలా సమస్యలు వున్నాయి. వీటికి పరిష్కారం దొరుకుతుందని దీనికి సమ్మతించాను. మొదటి నాలుగు మీటింగ్స్‌లోనే.. ఈ బంద్‌తో ఏం జరగదని అర్థమైపోయింది. కొన్ని సమస్యలు, లోపాలు గుర్తించారు. కానీ వాటి అమలు జరగలేదు.  సినిమా పరిశ్రమ బ్రతికుందంటే కొత్తగా వచ్చే రెండు వందల మంది నిర్మాతల వల్లే అని భావిస్తాను.. అని తెలిపారు. 


ఇంకా, సంక్రాంతి సినిమాల విషయంలో కౌన్సిల్ వ్యాఖ్యలపై ఆయన మాట్లాడుతూ.. చిరంజీవి (Chiranjeevi), బాలకృష్ణ (Balakrishna) సినిమాలు సంక్రాంతికి విడుదల కాబోతున్నాయి. వాళ్ల సినిమాల నిర్మాతలు ఎవరూ ఫిర్యాదు చేయలేదు. ఫిర్యాదు చేయకుండా ఈ విషయంలో కౌన్సిల్ మాట్లాడటం వంద శాతం తప్పు. ఈ సంగతి వాళ్లకి కూడా చెప్పాను. అయితే కీడు చేసే గుణం వున్న వాళ్ళు సినిమా ఇండస్ట్రీలో.. ఎంత పెద్ద హిట్లు ఇచ్చిన వారైనాగానీ.. ఫైనల్ గా జీరోలుగానే వెళ్లారు కానీ ఎవరూ హీరోగా వెళ్ళలేదు. ఇండస్ట్రీ ఇచ్చిన రూపాయితో మనం నిలబడ్డాం. ఇండస్ట్రీకి ఉపయోగపడమని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. (C Kalyan Sensational Comments on Shooting Bandh)

Updated Date - 2022-12-08T23:51:38+05:30 IST