సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

C Kalyan: పవన్ కళ్యాణ్ లేదా ఎన్టీఆర్ చేసుంటే ఆ సినిమా చరిత్ర సృష్టించేది

ABN, First Publish Date - 2022-12-09T00:35:09+05:30

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేదంటే యంగ్ టైగర్ ఎన్టీఆర్ కనుక నా గత చిత్రం చేసి ఉంటే.. ఆ సినిమా చరిత్ర సృష్టించేదని అన్నారు తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేదంటే యంగ్ టైగర్ ఎన్టీఆర్ కనుక నా గత చిత్రం చేసి ఉంటే.. ఆ సినిమా చరిత్ర సృష్టించేదని అన్నారు తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి అధ్యక్షులు, నిర్మాత సి. కళ్యాణ్ (C Kalyan). శుక్రవారం ఆయన పుట్టినరోజు సందర్భంగా గురువారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన గత చిత్రం సత్యదేవ్ (Satyadev) హీరోగా వచ్చిన ‘గాడ్సే’ (Godse) పరాభవంపై మాట్లాడారు. 


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మంచి సినిమా చేయాలని గాడ్సే తీశాం. అది మంచి సినిమానే. చాలా బాగా వచ్చింది. అయితే ప్రేక్షకులు ఓటీటీలో చూసినంతగా థియేటర్లో చూడలేదు. అయితే ఆ సబ్జెక్ట్‌ని మోయగలిగే ఆర్టిస్ట్ పడలేదని అనుకుంటున్నాను. ఆ సంగతి దర్శకుడికి కూడా ముందే చెప్పాను. అయితే అప్పటికే హీరోని ఫిక్స్ అయిపోయి వున్నాం. నా దృష్టిలో ఆ సబ్జెక్ట్‌ని మోయగలిగేది తెలుగులో ఇద్దరే ఇద్దరు. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), జూ. ఎన్టీఆర్ (Jr NTR). ఈ ఇద్దరిలో ఎవరు చేసినా ‘గాడ్సే’ సినిమా ఒక చరిత్ర (History) సృష్టించేది. పిల్లల్ని చదివించి, వారికి ఉద్యోగాలు రాక ఇబ్బంది పడుతున్న తల్లితండ్రులందరికీ ‘గాడ్సే’ రీచ్ అవుతుందని భావించాం. కానీ కుదరలేదు. ఇదొక్కటే బాధ వేసింది. అయితే ఈ సినిమా ఎక్కడా రాజీపడకుండా తీశాం. ఎక్కడా వెనకడుగు వేయలేదు. సత్యదేవ్ కెరీర్‌లోనే హయ్యెస్ట్ బడ్జెట్‌తో చేసిన సినిమా ‘గాడ్సే’. అయితే సినిమాలో డబ్బు పొతే పోయిందని అనుకోను. సినిమా ఇచ్చిన డబ్బుని అదే తీసుకెళ్ళిందని భావిస్తానని అన్నారు. (C Kalyan Comments on Godse Movie)

Updated Date - 2022-12-09T00:35:09+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!