ప్రపంచాన్ని గెలుస్తున్న రాముడు : బుర్రా సాయిమాధవ్

ABN , First Publish Date - 2022-03-27T19:39:03+05:30 IST

యంగ్ టైగర్ యన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలు గా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన క్రేజీ మల్టీస్టారర్ ‘ఆర్.ఆర్.ఆర్’. రెండు రోజుల క్రితం ప్రపంచ వ్యాప్తంగా విడుదలై బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్స్ రాబడుతోంది ఈ సినిమా. ఈ సందర్బంగా పలువురు సినీ ప్రముఖులు ఆ సినిమాపై పొగడ్తల వర్షం కుపిపించారు. ఇద్దరు హీరోల పెర్ఫార్మెన్స్ ను ఆకాశానికెత్తేస్తూ ట్వీట్ చేశారు. నేడు (ఆదివారం) రామ్‌చరణ్ పుట్టిన రోజు సందర్భంగా.. చెర్రీకి రెండు విధాలా విషెస్, ప్రశంసలు దక్కుతున్నాయి.

సూపర్ స్టార్ మహేశ్ బాబు, తండ్రి మెగాస్టార్ చిరంజీవి చెర్రీకి సినిమా పరంగా, పుట్టినరోజు సందర్భంగా విషెస్ తెలుపగా.. ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమా డైలాగ్ రైటర్ బుర్రా సాయిమాధవ్.. చెర్రీకి తనదైన శైలిలో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘ప్రపంచాన్ని గెలుస్తున్న రాముడు .. విశ్వవెండితెర మీద విజయసంతకం చేస్తున్న సీతారాముడు... విజేతకి విజేతే పుడతాడని నిరూపించిన రాంచరణ్ సార్ కి జన్మదిన శుభాకాంక్షలు’ అంటూ సాయిమాధవ్ చెర్రీని తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా విషెస్ తెలిపారు. ప్రస్తుతం సాయిమాధవ్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Updated Date - 2022-03-27T19:39:03+05:30 IST