Bujji Ila Raa: విడుదల తేదీ ఖరారు

ABN , First Publish Date - 2022-08-11T03:04:43+05:30 IST

టాలీవుడ్ స్టార్ కమెడియన్స్ సునీల్ (Sunil), ధన్‌రాజ్(Dhanraj) ప్రధాన పాత్రల్లో న‌టించిన చిత్రం ‘బుజ్జీ ఇలారా’ (Bujji Ila Raa). ‘ఇట్స్ ఏ సైక‌లాజిక‌ల్ థ్రిల్లర్‌’ అనేది ట్యాగ్‌లైన్‌. చాందిని అయ్యంగార్‌ హీరోయిన్‌గా

Bujji Ila Raa: విడుదల తేదీ ఖరారు

టాలీవుడ్ స్టార్ కమెడియన్స్ సునీల్ (Sunil), ధన్‌రాజ్(Dhanraj) ప్రధాన పాత్రల్లో న‌టించిన చిత్రం ‘బుజ్జీ ఇలారా’ (Bujji Ila Raa). ‘ఇట్స్ ఏ సైక‌లాజిక‌ల్ థ్రిల్లర్‌’ అనేది ట్యాగ్‌లైన్‌. చాందిని అయ్యంగార్‌ హీరోయిన్‌గా న‌టిస్తుంది. రూపా జ‌గ‌దీశ్ స‌మ‌ర్పణ‌లో ఎస్ఎన్ఎస్ క్రియేష‌న్స్ ఎల్ఎల్‌పి, జి నాగేశ్వర‌రెడ్డి టీమ్ వ‌ర్క్ ప‌తాకాల‌పై అంజి దర్శకత్వంలో అగ్రహారం నాగిరెడ్డి, సంజీవ‌రెడ్డి నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఆగస్ట్ 19న థియేటర్లలో విడుదల చేయబోతున్నట్లుగా తెలుపుతూ.. తాజాగా ఓ పోస్టర్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో సునీల్, ధన్ రాజ్ సీరియస్‌గా చూస్తుంటే.. మధ్యలో శ్రీకాంత్ అయ్యంగార్ తన ఫ్యామిలీతో నవ్వుతూ కనిపిస్తున్నారు.


ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. ‘‘ఇటీవల విడుదలైన మా సినిమా ట్రైలర్ మరియు సాంగ్స్‌కు చాలా మంచి ఆదరణ లభించింది. ఈ మధ్య సస్పెన్స్ థ్రిల్లర్స్ చిత్రాలు రావడం తగ్గాయి. మంచి టైమ్‌లో వస్తోన్న మా ‘బుజ్జీ ఇలారా’ చిత్రం ప్రేక్షకులను కచ్చితంగా థ్రిల్ చేస్తుంది. కామెడీతో తమదైన శైలిలో అలరించే సునీల్, ధనరాజ్ ఈ చిత్రంలో వినూత్నమైన పాత్రలలో నటించారు. వారి నటన ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఆగస్ట్ 19న థియేటర్లలో ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. సినిమా విడుదల లోపు మరో ట్రైలర్‌ను రిలీజ్ చేస్తాం..’’ అని తెలిపారు. (Bujji Ila Raa Release date)

Updated Date - 2022-08-11T03:04:43+05:30 IST