అన్నయ్య పుట్టిన రోజున తమ్ముడి లుక్‌!

ABN , First Publish Date - 2022-08-23T05:42:40+05:30 IST

సీనియర్‌ నటుడు కృష్ణ, విజయనిర్మల ఫ్యామిలీ నుండి శరణ్‌కుమార్‌ను హీరోగా పరిచయం చేస్తూ నిర్మిస్తున్న చిత్రం ‘సాక్షి’...

అన్నయ్య పుట్టిన రోజున తమ్ముడి లుక్‌!

సీనియర్‌ నటుడు కృష్ణ, విజయనిర్మల ఫ్యామిలీ నుండి శరణ్‌కుమార్‌ను  హీరోగా పరిచయం చేస్తూ నిర్మిస్తున్న చిత్రం ‘సాక్షి’. శివ కేశనకుర్తి దర్శకత్వంలో మునగాల సుధాకరరెడ్డి  ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మెగాస్టార్‌ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రంలో విలన్‌గా నటిస్తున్న నాగబాబు పాత్రకు సంబంధించిన  ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను సోమవారం విడుదల చేశారు. నిర్మాతలు దిల్‌ రాజు, బెక్కెం వేణుగోపాల్‌, దామోదర ప్రసాద్‌ సంయుక్తంగా  ఈ పోస్టర్‌ను విడుదల చేయడం విశేషం. చిత్రం షూటింగ్‌ పార్ట్‌ పూర్తయిందనీ, ప్రస్తుతం  పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయనీ, త్వరలో చిత్రాన్ని  విడుదల చేస్తామనీ  నిర్మాత చెప్పారు. జాహ్నవి కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో అజయ్‌, ఇంద్రజ, ఆమని తదితరులు ఇతర ముఖ్యతారాగణం. ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్‌ సిసిరోలియో, ఎడిటింగ్‌: సెల్వకుమార్‌, సినిమాటోగ్రఫీ: చైతన్య కందుల. 


Updated Date - 2022-08-23T05:42:40+05:30 IST

Read more