సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Vijay Deverakonda: పూరి ‘జనగణమన’కి బ్రేక్ ఇస్తాడేమో!

ABN, First Publish Date - 2022-08-25T19:44:13+05:30

‘లైగర్’ (Liger) తర్వాత విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) చేస్తున్న రెండు సినిమాల్లో ఒక సినిమా ‘జనగణమన’ (Janaganamana). ఇది కూడా పూరి జగన్నాథ్‌ (Puri Jagannadh)తో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఈమధ్యనే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘లైగర్’ (Liger) తర్వాత విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) చేస్తున్న రెండు సినిమాల్లో ఒక సినిమా ‘జనగణమన’ (Janaganamana). ఇది కూడా పూరి జగన్నాథ్‌ (Puri Jagannadh)తో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఈమధ్యనే అట్టహాసంగా ప్రారంభించారు. అయితే ఈరోజు విడుదలైన ‘లైగర్’ దెబ్బకి ఇప్పుడు ‘జనగణమన’ స్టార్ట్ అవుతుందా? అన్నది ఒక ప్రశ్నార్థకమే. ఎందుకంటే లైగర్ సినిమా మీద చాలా పెట్టుబడి పెట్టాం అంటున్నారు, మరి కొనుక్కున్న బయ్యర్లు అందరూ ఎంత నష్టపోతారు అన్నది మొదటి వారం అయిన తరువాత మాత్రమే తెలుస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో విజయ్ దేవరకొండ మళ్ళీ సాహసం చేస్తాడని అనుకోము. 


అతను తన కెరీర్ కొంచెం బాగుండాలి అనుకుంటే తన ఇంకో సినిమా ‘ఖుషీ’ (Kushi) మీద ఫోకస్ పెట్టి, ‘జనగణమన’కి బ్రేక్ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్టు విజయ్ క్యాంపు వాళ్ళు అంటున్నారు. అందుకే ఆ సినిమా ప్రారంభం మాత్రమే చేసి, ఈ ‘లైగర్’ సినిమా రిజల్ట్ చూశాక షూటింగ్ స్టార్ట్ చేయొచ్చని విజయ్ దేవరకొండ అండ్ టీం వాళ్ళు అనుకుంటున్నట్టు తెలిసింది.

Updated Date - 2022-08-25T19:44:13+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!