బర్త్‌డే స్పెషల్: అలియా భట్ ‘బ్రహ్మాస్త్రం’ లుక్‌ విడుదల

ABN , First Publish Date - 2022-03-16T00:46:52+05:30 IST

బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ పుట్టినరోజు (మార్చి 15) స్పెషల్‌గా ఆమె నటిస్తోన్న పాన్ ఇండియన్ సినిమా, బిగ్గెస్ట్ మ్యాగ్నమ్ ఓపస్ ‘బ్రహ్మాస్త్రం’ (మొదటి భాగం: శివ) సినిమాలోని ఆమె ఫస్ట్ లుక్‌‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో ఇషా పాత్రలో

బర్త్‌డే స్పెషల్: అలియా భట్ ‘బ్రహ్మాస్త్రం’ లుక్‌ విడుదల

బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ పుట్టినరోజు (మార్చి 15) స్పెషల్‌గా ఆమె నటిస్తోన్న పాన్ ఇండియన్ సినిమా, బిగ్గెస్ట్ మ్యాగ్నమ్ ఓపస్ ‘బ్రహ్మాస్త్రం’ (మొదటి భాగం: శివ) సినిమాలోని ఆమె ఫస్ట్ లుక్‌‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో ఇషా పాత్రలో అలియా నటిస్తోంది. తాజాగా విడుదల చేసిన ఈ లుక్‌ సోషల్ మీడియాలో మంచి స్పందనను అందుకుంటోంది. ఇప్పటికే విడుదలైన రణ్‌బీర్ కపూర్ శివ లుక్‌కు అద్భుతమైన స్పందన వచ్చిన విషయం తెలిసిందే. డిసెంబర్ 2021లో ఈ లుక్ విడుదలైంది. 


అయన్ ముఖర్జీ, అతడి టీమ్‌తో కలిసి ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. అలాగే అలియా భట్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆమె అభిమానులకు స్వీట్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఫాక్స్ స్టార్ స్టూడియోస్, ధర్మా ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్, స్టార్ లైట్ పిక్చర్స్ ఈ ప్రతిష్టాత్మకమైన చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. 2022, సెప్టెంబర్ 9న హిందీ, తమిళ, తెలుగు, మలయాళం, కన్నడలో ఈ సినిమా విడుదల కానుంది. అమితాబ్ బచ్చన్, నాగార్జున అక్కినేని, రణ్‌బీర్ కపూర్, అలియా భట్, మౌని రాయ్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగులో ఈ చిత్రాన్ని ఎస్.ఎస్. రాజమౌళి సమర్పిస్తున్నారు.



Updated Date - 2022-03-16T00:46:52+05:30 IST