సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Brahmastra: బాక్సాఫీస్ వద్ద సంచలనం..!

ABN, First Publish Date - 2022-09-10T21:33:35+05:30

బాలీవుడ్ స్టార్ కపుల్ ఆలియా భట్ (Alia Bhatt), రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) హీరో, హీరోయిన్‌లుగా నటించిన చిత్రం ‘బ్రహ్మాస్త్ర పార్ట్-1: శివ’ (Brahmastra Part One: Shiva). అయాన్ ముఖర్జీ (Ayan

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలీవుడ్ స్టార్ కపుల్ ఆలియా భట్ (Alia Bhatt), రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) హీరో, హీరోయిన్‌లుగా నటించిన చిత్రం ‘బ్రహ్మాస్త్ర పార్ట్-1: శివ’ (Brahmastra Part One: Shiva). అయాన్ ముఖర్జీ (Ayan Mukerji) దర్శకత్వం వహించాడు. ఫాక్స్‌‌స్టార్ స్టూడియోస్‌తో కలసి ధర్మ ప్రొడక్షన్స్ పతాకంపై కరణ్ జోహార్ (Karan Johar) నిర్మించాడు. ఈ సినిమా పాన్ ఇండియగా రూపొందింది. పలు భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 9న విడుదల అయింది. బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. భారీ స్థాయి వసూళ్లను రాబట్టింది.   


‘బ్రహ్మాస్త్ర’ ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు రూ. 75కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను రాబట్టిందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. భారత్‌లో ఈ చిత్రం రూ.37కోట్ల నెట్ కలెక్షన్స్‌ను రాబట్టిందని సమాచారం. ఈ నెట్ కలెక్షన్స్‌లో హిందీ వెర్షన్ రూ.32కోట్లు, ఇతర భాషల నుంచి రూ.5కోట్లు వచ్చాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దర్శకుడైన అయాన్ ముఖర్జీ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టర్‌ను నెటిజన్స్‌తో పంచుకున్నాడు. సినిమాను చూసిన అందరికి కృతజ్ఞతలు చెప్పాడు. ‘బ్రహ్మాస్త్ర’ ను పురాణాల్లోని అస్త్రాలను ఆధారంగా చేసుకుని ఫాంటసీ అడ్వెంచర్‌గా రూపొందిచారు. అయాన్ ముఖర్జీ ఈ మూవీ స్క్రిప్ట్ కోసం ఎనిమిదేళ్ల సమయాన్ని వెచ్చించాడు. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా అత్యధిక స్క్రీన్స్‌లో విడుదల చేశారు. ఇండియాలో 6000స్క్రీన్స్, ఓవర్స్‌స్‌లో 3000స్క్రీన్స్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. మూవీకి మిక్స్‌డ్ టాక్ వచ్చినప్పటికి భారీగా కలెక్షన్స్‌ను కొల్లగొడుతుంది. ఫస్ట్ వీకెండ్‌లోనే రూ. 100కోట్ల వసూళ్లను రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.



Updated Date - 2022-09-10T21:33:35+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!