సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Brahmaji: కరుడు కట్టిన తీవ్రవాది ‘బ్రహ్మన్న’గా బ్రహ్మాజీ

ABN, First Publish Date - 2022-09-14T23:36:35+05:30

ఇదేదో కృష్ణంరాజు (Krishnam Raju) నటించిన ‘బొబ్బిలి బ్రహ్మన్న’ (Bobbili Brahmanna) కాదు, అలా అని ‘గాడ్‌ఫాదర్’ (GodFather) సినిమాలో చిరంజీవి (Chiranjeevi) వేస్తున్న

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇదేదో కృష్ణంరాజు (Krishnam Raju) నటించిన ‘బొబ్బిలి బ్రహ్మన్న’ (Bobbili Brahmanna) కాదు, అలా అని ‘గాడ్‌ఫాదర్’ (GodFather) సినిమాలో చిరంజీవి (Chiranjeevi) వేస్తున్న ‘బ్రహ్మన్న’ (Brahmanna) రోల్ కూడా కాదు. బ్రహ్మాజీ (Brahmaji) ‘లైక్ షేర్ సబ్‌స్ర్కైబ్’ (Like Share Subscribe) అనే సినిమాలో వేస్తున్న రోల్! ఈ గెటప్‌లో బ్రహ్మాజీ తుపాకీ పట్టుకొని చాలా సీరియస్‌గా కనిపిస్తున్నాడు కదా. అతన్ని పట్టుకుంటే పది లక్షల రూపాయలు బహుమతి కూడా ఇస్తామని ప్రకటించారు. ఇంతకీ ఈ సినిమాలో బ్రహ్మాజీ నక్సలైట్ పాత్ర వేస్తున్నాడా, లేక ఇంకేమైనా చేస్తున్నాడా? కానీ పోస్టర్ మాత్రం అదిరింది కదా. 


పోస్టర్ మీద వైల్డ్, వైలెంట్, బృటల్ అని రాశారు.. అంటే అంత కరుడు కట్టిన తీవ్రవాది అని అర్థం. ఆయన పాత్ర నిజంగానే అలా వుంటుందా.. లేక హాస్యానికి ఏమైనా అలా ట్రై చేసి ఉంటారా.. అనేది సినిమా చూస్తేనే తెలుస్తుంది. ఏదైనా స్పూఫా లేక వ్యంగ్యంగా సరికొత్తగా ప్లాన్ చేశారా.. అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక బ్రహ్మాజీ ఈ పాత్రలో అనగానే.. అందరికీ సినిమాలో సెటైరికల్ కామెడీ చేస్తాడేమో అని అనిపిస్తుంది. సంతోష్ శోభన్ (Santosh Sobhan) ఇందులో కథానాయకుడు అయితే, బ్రహ్మాజీ ఒక ప్రధాన పాత్ర పోషిస్తున్నట్టు తెలిసింది. మేర్లపాక గాంధీ (Merlapaka Gandhi) మరోసారి ఈ ఇద్దరినీ కలిపి దర్శకత్వం చేస్తున్నాడు. ఇంతకు ముందు వీళ్లందరి కాంబినేషన్‌లో వచ్చిన ‘ఏక్ మినీ కథ’ (Ek Mini Katha) సినిమా మంచి హిట్ అయిన విషయం తెలిసిందే. 



Updated Date - 2022-09-14T23:36:35+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!