సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

లండన్‌లో అబ్బాయి.. అమ్మాయి

ABN, First Publish Date - 2022-07-04T07:10:36+05:30

నాగశౌర్య, మాళవిక నాయర్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఫలానా అబ్బాయి - ఫలానా అమ్మాయి’. అవసరాల శ్రీనివాస్‌ దర్శకుడు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాగశౌర్య, మాళవిక నాయర్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఫలానా అబ్బాయి - ఫలానా అమ్మాయి’. అవసరాల శ్రీనివాస్‌ దర్శకుడు. టిజి విశ్వ ప్రసాద్‌, దాసరి పద్మజ నిర్మాతలు. ప్రస్తుతం లండన్‌లో షూటింగ్‌ జరుగుతోంది. ‘‘నాగశౌర్యతో అవసరాల శ్రీనివాస్‌ తెరకెక్కించిన ‘ఊహలు గుసగుసలాడే’, ‘జ్యో అత్యుతానంద’ మంచి విజయాల్ని అందుకొన్నాయి. నాగశౌర్య- మాళవికలది హిట్‌ కాంబో. వారిద్దరూ జంటగా నటించిన ‘కల్యాణ వైభోగమే’ ప్రేక్షకాదరణ పొందింది. ఇలాంటి హిట్‌ కలయికలో రూపొందే ఈ చిత్రం కూడా తప్పకుండా ప్రేక్షకుల మనసుల్ని గెలచుకుంటుంది. అవసరాల శ్రీనివాస్‌ కథలన్నీ వినోదాత్మకంగా ఉంటాయి. ఈ సినిమా కూడా నవ్వుల విందు పంచుతుంద’’న్నారు నిర్మాతలు. సహ నిర్మాత: వివేక్‌ కూచిభొట్ల.


Updated Date - 2022-07-04T07:10:36+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!