అప్పుడు తిట్టినోళ్లే ఇప్పుడు శభాష్‌ అంటున్నారు!

ABN , First Publish Date - 2022-03-28T02:03:35+05:30 IST

బిగ్‌బీ అమితాబ్‌ నటించిన ‘జంజీర్‌’ సినిమా పేరు చెడగొట్టారని అప్పట్లో బాలీవుడ్‌ ప్రేక్షకులు విమర్శించారు. రామ్‌చరణ్‌ నటనపై విమర్శకులు మండిపడ్డారు. 2013లో రామ్‌చరణ్‌ ‘జంజీర్‌’ చిత్రంతో బాలీవుడ్‌లో అడుగుపెట్టారు. తెలుగులో ‘తుఫాన్‌’ టైటిల్‌తో విడుదలైంది. అపూర్వ లఖియా దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి బాలీవుడ్‌లో ఆశించిన ఫలితం దక్కలేదు. దాంతో విమర్శకులు ఓ పక్క, ప్రేక్షకులు మరో పక్క విమర్శల అస్త్రాలు సంధించారు.

అప్పుడు తిట్టినోళ్లే ఇప్పుడు శభాష్‌ అంటున్నారు!

బిగ్‌బీ అమితాబ్‌ నటించిన ‘జంజీర్‌’ సినిమా పేరు చెడగొట్టారని అప్పట్లో బాలీవుడ్‌  ప్రేక్షకులు విమర్శించారు. రామ్‌చరణ్‌ నటనపై విమర్శకులు మండిపడ్డారు. 2013లో రామ్‌చరణ్‌ ‘జంజీర్‌’ చిత్రంతో బాలీవుడ్‌లో అడుగుపెట్టారు. తెలుగులో ‘తుఫాన్‌’ టైటిల్‌తో విడుదలైంది. అపూర్వ లఖియా దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి బాలీవుడ్‌లో ఆశించిన ఫలితం దక్కలేదు. దాంతో విమర్శకులు ఓ పక్క, ప్రేక్షకులు మరో పక్క విమర్శల అస్త్రాలు సంధించారు. సరిగ్గా ఇది జరిగి తొమ్మిదేళ్లు కావొస్తుంది. ఆ తర్వాత రామ్‌ చరణ్‌ బాలీవుడ్‌ జోలికి వెళ్లలేదు. కరెక్ట్‌గా 9 సంవత్సరాల తర్వాత ‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో మళ్ళీ హిందీ చిత్ర పర్రిమశలో అడుగుపెట్టారు చరణ్‌.


ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కడ చూసిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మానియా నడుస్తోంది. భాషతో సంబంధం లేకుండా సినిమా చూసిన వారంతా రాజమౌళి, తారక్‌, చరణ్‌లను ప్రశంసిస్తున్నారు. అలాగే బాలీవుడ్‌లో కూడా చరణ్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ‘జంజీర్‌’ విడుదలైనప్పుడు ఎవరెవరైతే రామ్‌చరణ్‌ నటనను విమర్శించారో ఇప్పుడు వాళ్లతోనే గొప్ప నటుడు అనిపించుకున్నాడు చెర్రీ. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చూసిన  బాలీవుడ్‌ ప్రేక్షకులు అల్లూరిగా రామ్‌ చరణ్‌ నటన చూసి శభాష్‌ అంటున్నారు. ‘జంజీర్‌’ నుంచి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కు చరణ్‌ నటనలో చాలా మార్పు వచ్చిందని అంటున్నారు. ఒకప్పుడు తిట్టి, విమర్శించిన వారే పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేస్తున్నారు.
ఇక ఆర్‌ఆర్‌ఆర్‌ విజయంతో చరణ్‌ ఆదివారం తన పుట్టినరోజు వేడుకను గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసుకున్నారు. రాజమౌళి, ఎన్టీఆర్‌ దంపతులు ఈ వేడుకలో పాల్గొని సందడి చేశారు. ఎన్టీఆర్‌ ఎన్నోసార్లు తన భార్యను ఇంట్లో వదిలేసి నా దగ్గరకు వచ్చేవాడని చరణ్‌ చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. 


Updated Date - 2022-03-28T02:03:35+05:30 IST