సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Bindu Madhavi: బిగ్ బాస్ బిందుమాధవి ఇప్పుడు ఏమి చేస్తోంది అంటే..

ABN, First Publish Date - 2022-10-08T00:29:11+05:30

మొదటి సారిగా ఓటిటిలో (OTT) నాన్-స్టాప్ (Bigg Boss non-stop) ప్రత్యక్ష ప్రసారంగా మొదలు పెట్టిన బిగ్ బాస్ విజేత (Bigg boss winner) బిందు మాధవి (Bindu Madhavi).

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మొదటి సారిగా ఓటిటిలో (OTT) నాన్-స్టాప్ (Bigg Boss non-stop) ప్రత్యక్ష ప్రసారంగా మొదలు పెట్టిన బిగ్ బాస్ విజేత (Bigg boss winner) బిందు మాధవి (Bindu Madhavi). ఆమె తెలుగు, తమిళ సినిమాల్లో నటించి పాపులర్ నటి కూడా అయింది. 


ఆమె ఇలా ఓటిటిలో లో మొదలు పెట్టిన మొదటి బిగ్ బాస్ విజేత గా నిలిచింది. బిందు తెలుగు బిగ్ బాస్ విజేత అయినా, ఆమెకి తెలుగు సినిమా లో చేసే అవకాశం ఆమె విజేతగా నిలిచిన తరువాత రాలేదు. ఆమె ఇప్పుడు ఏవో కొన్ని తమిళ సినిమాల్లో చేస్తూ వుంది. 


తెలుగులో ఏమి చేయటం లేదు. బిగ్ బాస్ విజేతగా నిలిచినా కూడా ఆమెకి తెలుగులో అవకాశాలు రాకపోవటం కొంచెం ఆశ్చర్యంగానే వుంది. అదే బిగ్ బాస్ ఇంట్లో వున్న కొంతమంది నటులకి తెలుగులో మంచి అవకాశాలే వచ్చాయి. అలాగే విజేత కాకపోయినా చిరంజీవి (Mega Star Chiranjeevi) లాంటి నటుడిని మెప్పించిన దివి (Bigg boss fame Divi) అనే అమ్మాయి ఈమధ్య విడుదల అయిన 'గాడ్ ఫాదర్' (GodFather) చిత్రం లో చిన్న రోల్ సంపాదించటమే కాకుండా, చిరంజీవి నటిస్తున్న తరువాతి సినిమాలో కూడా దివి చేస్తోంది. కానీ మరి బిగ్ బాస్ విజేత అయిన బిందు మాధవి కి ఇక్కడ తెలుగు లో రాకపోవటం ఏంటి, మన తెలుగు దర్శకులు చూడలేదా, లేక బిందు మాధవి తెలుగులో వద్దనుకుంటోందా? గతంలో కథానాయకురాలు గా చేసిన బిందు మాధవి, ఇప్పుడు ఏమైనా సపోర్టింగ్ రోల్ వొప్పుకోవటం లేదా? అనే మాటలు కూడా వినపడుతున్నాయి. ఇప్పటి నటీ నటులు ఒక్క కథానాయకుడు/నాయకురాలు పాత్రలే కాకుండా, బాగుంటే ఎటువంటి పాత్రను చేయడానికి అయిన సిద్ధం అవుతున్నారు. 


సత్యదేవ్ (Satya Dev of 'GodFather fame) ని చూస్తే అర్థం అవుతుంది. ఒక పక్క కథానాయకుడిగా చేస్తూనే, ఇంకో పక్క 'గాడ్ ఫాదర్' లాంటి సినిమాలో ఒక విలన్ పాత్ర వస్తే చేశాడు, మెప్పించాడు కూడా. అందువల్ల మంచి పాత్రలు వచ్చినప్పుడు, అది మెయిన్ లీడ్ అవ్వకపోయినా చేయటం వల్ల మంచి పేరు కూడా వస్తుంది. అలాగే బిందు మాధవికి తెలుగు లో కూడా మంచి అవకాశాలు వస్తాయని ఆశిద్దాం. 

Updated Date - 2022-10-08T00:29:11+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!