Bigg Boss 6: నాగ్‌లో ఫైర్‌ లేదు.. పిట్టకథలో ఏం చెప్పబోతున్నారు?

ABN , First Publish Date - 2022-09-24T23:51:03+05:30 IST

బిగ్‌బాస్‌ హౌస్‌లో మూడోవారం పూర్తికావొచ్చింది. ఇంటి సభ్యుల ఆట ఎలా ఉన్నా.. శనివారం రాగానే నాగార్జున వస్తారు... హౌస్‌మేట్స్‌ని ఏమంటారు? ఎవరి మీద విరుచుపడతారు అన్న ఆసక్తి ఉంటుంది.

Bigg Boss 6: నాగ్‌లో ఫైర్‌ లేదు.. పిట్టకథలో ఏం చెప్పబోతున్నారు?

బిగ్‌బాస్‌(Bigg boss) హౌస్‌లో మూడోవారం పూర్తికావొచ్చింది. ఇంటి సభ్యుల ఆట ఎలా ఉన్నా.. శనివారం రాగానే నాగార్జున వస్తారు... హౌస్‌మేట్స్‌ని ఏమంటారు? ఎవరి మీద విరుచుపడతారు అన్న ఆసక్తి ఉంటుంది. అందుకే శనివారం ప్రోమో కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. తాజా ప్రోమోను (Latest promo) నిర్వాహకులు విడుదల చేశారు. ఊహించిన రీతిలో ప్రోమో లేదు. నాగ్‌ మాటల్లో ఫైర్‌ కనపించలేదు. అయితే ఈసారి ఇంట్లో గొడవలు క్రియేట్‌ చేసిన వారిపై కాకుండా ఇంట్లో బుద్దుడిలా – రేలంగి మావయ్యగా గుర్తింపు తెచ్చుకున్న బాలాదిత్యపై నాగ్‌ (Nagarjuna Fire)విరుచుకుపడ్డారు. ఇంట్లో పొరపాట్లు చేస్తున్న వారిని, పని చేయకుండా తిని కూర్చునే వారిని కాకుండా నలుగురిని కలుపుకొని పోయే బాలాదిత్యను హర్ట్‌ చేసేలా మాట్లాడారు నాగ్‌. ప్రోమోలో ఏముందంటే..


గతవారం సోఫా వెనుక తొమ్మిది మంది నిలబడితే అందులో ఇద్దరు ఎలిమినేట్‌ అయ్యారు. అందులో మిగిలిన వారు ఈ వారం సోఫా వెనుక నిలబడ్డారు. మీరు ఆట ఆడాం అనుకుంటున్నారా? అని నాగ్‌ వారిని ప్రశ్నించారు. కొందరు ఆడాం అని సమాధానమిస్తే.. మరికొందరు తల దించుకున్నారు. శ్రీహాన్‌(Sri haan), శ్రీసత్య (Sri satya)ఆట బాగా ఆడారని పొగిడారు. కనీసం వారికి చప్పట్లు అయినా కొట్టరా అని అడిగారు. అందుకు బాలాదిత్య ‘వెనకున్నాం అనే షాక్‌లో కొట్టలేదు సర్‌’ అంటాడు. మీ ఆట చూసి మేం కూడా షాక్‌లోనే ఉన్నాం అని నాగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. అందుకు బాలాదిత్య రీజన్‌ చెప్పగా ఆ రీజన్‌ కన్వెన్‌సింగ్‌గా లేదని నాగార్జున ఆడియన్స్‌ ఒపీనియన్‌ తీసుకున్నారు. బాలాను తిడుతుంటే గలాటా గీతు మాత్రం నవ్వుతూ కనిపించింది. ‘ముందున్న వారి గురించి కూడా చాలా పిట్ట కథలు చెప్పాలి’ అని రెండో ప్రోమో గురించి హింట్‌ ఇచ్చారు నాగ్‌. అయితే రెండో ప్రోమోలో 18వ ఎపిసోడ్‌లో జరిగిన పిట్ట కథ ఇష్యూ గురించి నాగ్‌ మాట్లాడే అవకాశం ఉందని తెలుస్తోంది. 


అయితే ఈ ప్రోమో  చూసి అభిమానులు మాత్రం ‘ఇదేంట్రా ఇలా ఉంది.. ఇంట్లో లొల్లి చేసేవారిని వదిలేసి మంచోడైన బాలాదిత్య మీద పడ్డాడు నాగార్జున’ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. మరి శనివారం రాత్రి టెలిక్యాస్ట్‌ అయ్యే ఎపిసోడ్‌ ఎలా ఉండబోతుందో చూడాలి. 


Updated Date - 2022-09-24T23:51:03+05:30 IST