Bigg Boss 6: ప్రతి విషయంలో ఆమెను టార్గెట్ చేస్తున్న బాలాదిత్య...!
ABN , First Publish Date - 2022-09-09T14:02:35+05:30 IST
కింగ్ నాగార్జున (Nagarjuna) హోస్ట్ చేస్తున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ 6 (Bigg Boss 6) లేస్ట్ ఎపిసోడ్లో ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి.
కింగ్ నాగార్జున (Nagarjuna) హోస్ట్ చేస్తున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ 6 (Bigg Boss 6) లేస్ట్ ఎపిసోడ్లో ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రతి విషయంలో నన్ను టార్గెట్ చేస్తున్నావని ఇనయ బాలాదిత్యను నేరుగా అడిగింది. బిగ్ బాస్ హౌస్‌లో గొడవలు పీక్స్‌కి చేరుకుంటున్నాయి. ఎవరికి వాళ్లు అస్సలు తగ్గేదేలే అన్నట్టుగా రెచ్చిపోతున్నారు. చలాకీ చంటి.. గలాటా గీతుల మధ్య మాటల యుద్ధం జరిగింది. అలాగే, సింగర్ రేవంత్, ఆరోహిలు మధ్య పెద్ద గొడవే జరిగింది.
లేటెస్ట్ ఎపిసోడ్లో చంటి, గలాటా గీతుల మధ్య చర్చ జరిగింది. చంటి మాట్లాడకుండా చేస్తున్నాడని గీతు అనడంతో ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలి.. అంటూ చురకలేశాడు చంటి. అమ్మ బాగుందా? నీ అమ్మ బాగుందా? అనే దానికి చాలా తేడా ఉంది. నువ్వు ఒక పాయింట్లో ఉన్నప్పుడు నేను ఏం చెప్పినా నీకు అర్ధం కాదు..అని అన్నాడు చంటి.
ఇక బాలాదిత్య.. ఇనయ రంగు, అందం గురించి మాట్లాడుతూ.. బాడీ షేమింగ్ చేసిన పాయింట్ అందరి ముందు లేవనెత్తాడు. దాంతో అతను వెటకారంగా మాట్లాడుతున్నాడని.. అందంగా, తెల్లగా ఉన్నాడని పొగిడానే తప్ప తాను బాడీ షేమింగ్ చేయలేదని క్లారిటీ ఇచ్చింది ఇనయ. ఎన్నిసార్లు మంచిగా ఉండటానికి ట్రై చేసినా.. ప్రతి విషయంలోనూ నన్ను టార్గెట్ చేస్తున్నావ్.. నీతో ఫైట్ చేయడానికి రెడీ అంటూ బాలాదిత్యతో సూటిగా చెప్పింది ఇనయ.
ఆ తరువాత రేవంత్.. బాలాదిత్య, ఆర్జే సూర్య, మెరీనా-రోహిత్‌లను కెప్టెన్‌గా ఎంచుకున్నాడు. అలాగే.. రాజశేఖర్, ఆర్జే సూర్య, బాలాదిత్యలను నామినేట్ చేశాడు. వాసంతి క్రిష్ణన్.. ఆర్జే సూర్యకి కెప్టెన్‌గా ఓటు వేసింది. షానీ సల్మాన్ కూడా ఆర్జే సూర్యకి ఓటు వేశాడు. అయితే, కెప్టెన్సీ రేస్‌లో మాస్ వాళ్లంతా ఏకగ్రీవంగా.. ఆర్జే సూర్య, మెరీనా-రోహిత్, బాలాదిత్యలను కెప్టెన్సీకి పోటీదారులుగా ఎంచుకున్నారు.