సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Manoj-Mounika: అసలు విషయం తెలిసేది ఎప్పుడంటే?

ABN, First Publish Date - 2022-09-15T02:01:40+05:30

మంచు మనోజ్ (Manchu Manoj), భూమా మౌనికా రెడ్డి (Bhuma Mounika Reddy) ఒక్కటి కాబోతున్నారా? ఇద్దరూ రెండో పెళ్లి చేసుకోబోతున్నారా? అసలు వారిద్దరి మధ్య ఉన్న బంధం ఏమిటి?..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంచు మనోజ్ (Manchu Manoj), భూమా మౌనికా రెడ్డి (Bhuma Mounika Reddy) ఒక్కటి కాబోతున్నారా? ఇద్దరూ రెండో పెళ్లి చేసుకోబోతున్నారా? అసలు వారిద్దరి మధ్య ఉన్న బంధం ఏమిటి?.. వినాయకచవితి పండుగను పురస్కరించుకుని.. సీతాఫలమండిలోని ఓ గణేష్ మండపంలో వారిద్దరిని చూసిన తర్వాత ఇండస్ట్రీలో మొదలైన ప్రశ్నలివి. ఇది జరిగి వారం రోజులకు పైనే అయినా.. రెండో పెళ్లి అంటూ అన్ని రకాల మీడియాలు హడావుడి చేస్తున్నా.. అటు మంచు ఫ్యామిలీ నుండిగానీ, ఇటు భూమా ఫ్యామిలీ నుండిగానీ ఇప్పటి వరకు ఎవరూ స్పందించలేదు. కానీ, సోషల్ మీడియాలో వారి పెళ్లి తేదీ కూడా ఖరారైందనేలా వార్తలు దర్శనమిస్తున్నాయి. అలాగే.. ఆ మధ్య చంద్రబాబుని మోహన్‌బాబు కలిసింది కూడా మనోజ్ రెండో పెళ్లిపై మాట్లాడేందుకే అనేలా కూడా వార్తలు వైరల్ అయినా.. నిజమేమిటి? అని చెప్పేందుకు ఎవరూ ముందుకు రాలేదు. అయితే భూమా ఫ్యామిలీ నుండి.. ఇదే విషయంపై మాట్లాడేందుకు భూమా అఖిల ప్రియ (Bhuma Akhila Priya) మీడియా సమావేశం నిర్వహించబోతోన్నట్లుగా తాజాగా ఓ వార్త మీడియా సర్కిల్స్‌లో వైరలైంది. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మీడియా ముందుకు రాబోతోంది అఖిల ప్రియ కాదని, ఆమె సోదరుడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి (దివంగత భూమా నాగిరెడ్డి కుమారుడు) అని తెలుస్తోంది. 


మంచు మనోజ్, భూమా మౌనికా రెడ్డిల మ్యాటర్‌పై మాట్లాడేందుకు గురువారం సాయంత్రం 5గంటలకు హైదరాబాద్‌లోని తన నివాసంలో భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి (Bhuma Jagat Vikhyat Reddy) మీడియా సమావేశం నిర్వహించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ సమావేశంలో విఖ్యాత్ ఏం చెప్పబోతున్నారనేది ఇప్పుడాసక్తికరంగా మారింది. ఈ మీడియా సమావేశం తర్వాత మంచు మనోజ్, భూమా మౌనికల వ్యవహారంపై ఓ క్లారిటీ వచ్చే అవకాశమైతే ఉంది.

Updated Date - 2022-09-15T02:01:40+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!