విడుదలకు భళా!
ABN, First Publish Date - 2022-04-30T06:02:48+05:30
శ్రీవిష్ణు హీరోగా వారాహి చలనచిత్రం సంస్థ చైతన్య దంతలూరి దర్శకత్వంలో...
శ్రీవిష్ణు హీరోగా వారాహి చలనచిత్రం సంస్థ చైతన్య దంతలూరి దర్శకత్వంలో నిర్మించిన ‘భళా తందనాన’ చిత్రం విడుదల తేదీ ఖరారు అయింది. వైవిధ్యమైన కథాంశంతో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని సమ్మర్ స్పెషల్‌గా మే 6న విడుదల చేయనున్నట్లు చిత్రనిర్మాత రజనీ కొర్రపాటి చెప్పారు. కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంలో కేథరిన్ థ్రేసా హీరోయిన్‌గా నటించారు. మణిశర్మ స్వరపరిచిన ఈ సినిమాలోని లిరికల్ వీడియోలకు మంచి స్పందన లభించిందనీ, అలాగే టీజర్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొని సినిమాపై అంచనాలు పెంచిందనీ దర్శకనిర్మాతలు చెప్పారు. రామచంద్రరాజు, శ్రీనివాసరెడ్డి, సత్య తదితరులు నటించిన ఈ చిత్రానికి రచన: శ్రీకాంత్ విస్సా, సినిమాటోగ్రఫీ: సురేశ్ రగుతు, ఎడిటింగ్: మార్తాండ్‌కె వెంకటేశ్, ఫైట్స్: పీటర్ హెయిన్, సమర్పణ: సాయి కొర్రపాటి.