రొమాంటిక్‌గా నువ్వుంటే చాలు

ABN , First Publish Date - 2022-12-29T00:42:11+05:30 IST

సందీప్‌ కిషన్‌ కథానాయకుడిగా నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘మైఖేల్‌’. దివ్యాంశ కౌశిక్‌ కథానాయిక...

రొమాంటిక్‌గా నువ్వుంటే చాలు

సందీప్‌ కిషన్‌ కథానాయకుడిగా నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘మైఖేల్‌’. దివ్యాంశ కౌశిక్‌ కథానాయిక. రంజిత్‌ జయకోడి దర్శకత్వంలో భరత్‌చౌదరి, పుస్కూర్‌ రామ్‌ మోహన్‌రావు నిర్మిస్తున్నారు. సిద్‌ శ్రీరామ్‌ ఆలపించిన ‘నువ్వుంటే చాలు’ అంటూ సాగే తొలి గీతాన్ని చిత్ర బృందం బుధవారం విడుదల చేసింది. సందీప్‌ కిషన్‌, దివ్యాంశ కౌశిక్‌ పైన సాగే ఈ రొమాంటిక్‌ గీతానికి కల్యాణ చక్రవర్తి త్రిపురనేని సాహిత్యం అదించగా, సామ్‌ సీఎస్‌ అద్భుతంగా స్వరపరిచారు. ఈ చిత్రంలో దర్శకుడు గౌతమ్‌ వాసుదేవ మీనన్‌ ప్రతినాయక పాత్ర పోషిస్తున్నారు. విజయ్‌ సేతుపతి, వరలక్ష్మీ శరత్‌కుమార్‌, వరుణ్‌ సందేశ్‌ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. సినిమాటోగ్రఫీ: కిరణ్‌ కౌశిక్‌

Updated Date - 2022-12-29T00:42:11+05:30 IST

Read more