సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Bandla Ganesh : మళ్ళీ వార్తల్లోకి బండ్ల గణేశ్.. ఈసారి ఇంకో వివాదస్పద ట్వీట్

ABN, First Publish Date - 2022-09-14T19:40:58+05:30

టాలీవుడ్ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ మరోసారి వివాదంలోకి వచ్చాడు. అతను పవన్ కళ్యాణ్‌కి ఒక డై హార్డ్ ఫ్యాన్ అని చెప్పుకుంటూ ఉంటాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టాలీవుడ్ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ మరోసారి వివాదంలోకి వచ్చాడు. అతను పవన్ కళ్యాణ్‌కి ఒక డై హార్డ్ ఫ్యాన్ అని చెప్పుకుంటూ ఉంటాడు. అలాగే పవన్ కల్యాణే తనకి దైవం అంటాడు. అలాంటి బండ్ల గణేష్ ఈసారి వేరే వాళ్ళ మీద ట్వీట్ చేస్తూ, దాన్ని పవన్ కళ్యాణ్‌కి ముడి పెట్టాడు. సోమవారం రాత్రి జరిగిన ఒక సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు నటులు అడివి శేష్, జొన్నలగడ్డ సిద్ధూ వచ్చారు. వాళ్లిద్దరూ కూర్చున్న విధానం, ఒక ఫోటో పెట్టి, దాని పక్కనే పవన్ కళ్యాణ్ కూర్చున్న విధానం ఫోటో పెట్టి, ట్వీట్ పెట్టాడు. 


"నమస్కారానికి నిలువెత్తు నిదర్శనం మా దేవర దయచేసి నేర్చుకోండి. ఆచరించండి. అది మన ధర్మం’.. అని ట్వీట్ చేశాడు బండ్ల గణేష్. వూరికే వివాదాల్లోకి వస్తున్నాడు గణేష్, ఎదో తాను వార్తల్లో ఉండాలి అన్నట్టుగా. ఈ మధ్యనే  పూరి జగన్‌ను.. ఆయన కొడుకు ఫంక్షన్‌కే రాలేదని ఓపెన్ గానే  విమర్శించాడు. మళ్ళీ ఇప్పుడు ఈ ఇద్దరు నటులు కూర్చున్న విధానం బాగోలేదని విమర్శించి వార్తల్లో నిలిచాడు. దీనికి పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఒప్పుకోవటం లేదు. ‘బాబూ.. బండ్ల గణేష్ మా పవన్ కళ్యాణ్‌ని వదిలేయన్నా.. అని కామెంట్స్ పెడుతున్నారు. ఏదేమైనా బండ్ల ఇలా అందరిని విమర్శిస్తూ, కొన్నిటిని పవన్ కళ్యాణ్‌కి ముడిపెడుతూ ఉండటం కూడా చాలామందికి నచ్చటం లేదు అని అంటున్నారు పరిశ్రమలో.



Updated Date - 2022-09-14T19:40:58+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!