Bandla Ganesh: బండ్లన్న భారీ కటౌట్స్

ABN , First Publish Date - 2022-09-24T23:33:34+05:30 IST

నటుడు, నిర్మాత బండ్ల గణేష్ (Bandla Ganesh) భారీ కటౌట్స్ (Big Cutouts) ఫిలింనగర్ (Film Nagar) చుట్టుపక్కల అంతా నింపేశారు. బండ్ల గణేష్ ఏమైనా రాజకీయ పార్టీ లో చేరడమో, లేదా మునుగోడు (Munugodu) బై ఎలక్షన్స్ (Bye election) లో పోటీ చేస్తున్నాడేమో అని మీరు అనుకుంటే అది పొరపాటే.

Bandla Ganesh: బండ్లన్న భారీ కటౌట్స్

నటుడు, నిర్మాత బండ్ల గణేష్ (Bandla Ganesh) భారీ కటౌట్స్ (Big Cutouts) ఫిలింనగర్ (Film Nagar) చుట్టుపక్కల అంతా నింపేశారు.  బండ్ల గణేష్ ఏమైనా రాజకీయ పార్టీ లో చేరడమో, లేదా మునుగోడు (Munugodu) బై ఎలక్షన్స్ (Bye election) లో పోటీ చేస్తున్నాడేమో అని మీరు అనుకుంటే అది పొరపాటే. అవేమీ కాదు, గణేష్, ఫిలిం నగర్ కల్చరల్ క్లబ్ (ఎఫ్ఎన్ సిసి) (FNCC) కి జరగబోయే ఎన్నికల్లో (Elections) వైస్ ప్రెసిడెంట్ (Vice President) గా పోటీ చేస్తున్నాడు. అంతే! దానికే ఇంత హడావిడి చేస్తున్నాడు. ఇంతకీ ఈ ఫిలిం నగర్ కల్చరల్ క్లబ్ (FNCC) లో సుమారు రెండు వేల (Two thousand) మంది సభ్యులు వుంటారు. 



దానికే ఇంత హడావిడి చేస్తున్నారు. ఒక్క బండ్ల గణేష్ కాకుండా, మిగతా సభ్యులు కూడా పెద్ద పెద్ద ఫ్లెక్సీ (Flexi) లు పెట్టారు. ఈ తెలుగు చలన చిత్ర పరిశ్రమలో (Telugu Film Industry) ఏమి జరిగినా హడావిడే. సభ్యులు అందరూ వందల్లో వుంటారు, కానీ హడావిడి మాత్రం దేశం అంత వినపడుతూ ఉంటుంది. ఇంతకు ముందు మా ఎలక్షన్స్ (MAA Elections) కూడా ఇలానే అయ్యాయి కదా. అవి అయితే అస్సలు ఒక స్టేట్ ఎలెక్షన్స్ ని తలపించేలా ప్రచారం చేసి ఒకరి మీద ఒకరు విమర్శలు గుప్పించి చిత్ర పరిశ్రమ ఆంటీ విరక్తి వచ్చేట్టు చేసారు. అయితే ఈ ఎఫ్ఎన్ సిసి ఎలెక్షన్స్ కి మాత్రం కేవలం కటౌట్స్, ఫ్లెక్సీ లు తో ఫిలింనగర్ అంతా  నింపి,సరిపెట్టేసారు. మా ఎలెక్షన్స్ లో కొద్దిగా మిస్ అయిన బండ్ల గణేష్ ఈసారి మాత్రం ఈ ఎఫ్ఎన్ సిసి కి జరుగుతున్న పోటీలో ప్రతిష్టాత్మకంగా తీసుకొని గెలుపే ఉద్దేశంతో ఉన్నట్టు కనపడుతోంది. రేపు ఆదివారమే ఎలెక్షన్స్, గెలుపోటములు సాయంత్రానికి తెలిసిపోతాయి. 

Updated Date - 2022-09-24T23:33:34+05:30 IST