క్లైమాక్స్‌కు బాలుగాడి లవ్‌స్టోరి
ABN , First Publish Date - 2022-09-17T08:17:23+05:30 IST
ఆకుల అఖిల్, దర్షిక మీనన్ హీరో హీరోయిన్లుగా పరిచయమవుతున్న చిత్రం ‘బాలుగాడి లవ్‌స్టోరీ’.

ఆకుల అఖిల్, దర్షిక మీనన్ హీరో హీరోయిన్లుగా పరిచయమవుతున్న చిత్రం ‘బాలుగాడి లవ్‌స్టోరీ’. ఎల్ శ్రీనివాస్ తేజ్‌ను డైరెక్టర్‌గా పరిచయం చేస్తూ ఆకుల మంజుల నిర్మిస్తున్నారు. టాకీపార్ట్ పూర్తయింది. ఈ సందర్భంగా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ని చిత్రబృందం విడుదల చేసింది. మూడు పాటలు, రెండు ఫైట్స్ మినహా సినిమా మొత్తం పూర్తయింది, త్వరలో విడుదల చేస్తాం అని దర్శక నిర్మాతలు తెలిపారు. చిత్రం శ్రీను, జబర్దస్త్ చిట్టిబాబు, గడ్డం నవీన్ కీలకపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఘన శ్యామ్ సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీ: రవికుమార్ నీర్ల