Balakrishna: టర్కీ నుండి బాలయ్య వస్తున్నాడు, ఇక దబిడి దిబిడే

ABN , First Publish Date - 2022-09-24T21:01:14+05:30 IST

నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) టర్కీ (Turkey) లో గోపీచంద్ మలినేని (Gopichand Malineni) దర్శకత్వం లో సినిమా షూటింగ్ చేస్తున్నాడు. చాల కీలక..

Balakrishna: టర్కీ నుండి బాలయ్య వస్తున్నాడు, ఇక దబిడి దిబిడే

నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) టర్కీ (Turkey) లో గోపీచంద్ మలినేని (Gopichand Malineni) దర్శకత్వం లో సినిమా షూటింగ్ చేస్తున్నాడు. చాల కీలక సన్నివేశాలు (Key Scenes) కొన్ని అక్కడ చిత్రీకరించినట్టు తెలుస్తోంది. అలాగే బాలయ్య అక్కడ టర్కీ లో కొంతమంది తో తీసుకున్న వీడియోస్, ఫొటోస్ ఇప్పటికే సాంఘీక మాధ్యమాల్లో (Social media) బాగా వైరల్ అయ్యాయి. షూటింగ్ ఇప్పుడు చివరి దశకి చేరుకుంది, బాలయ్య సోమవారం (Monday) నాడు మళ్ళీ హైదరాబాద్ (Return to Hyderabad) కి రానున్నారని తెలిసింది. 


ఆంధ్ర ప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం (Government) హెల్త్ యూనివర్సిటీకి (Health University) ఎన్ఠీఆర్ (NTR) పేరును తీసేసి వై ఎస్ ఆర్ (YSR) పేరును (Name change) పెట్టిన సంగతి తెలిసిందే. దానివల్ల చాల కోపంగా వున్నా బాలయ్య తన అభిప్రాయాన్ని కూడా విడుదల చేసారు. అయితే సోమవారం హైదరాబాద్ చేరుకున్న తరువాత బాలయ్య తన ప్రతాపాన్ని చూపిస్తారని, అంతా దబిడి దిబిడే (Dabidi Dibidi) అని అంటున్నారు అతని అభిమానులు. ఎందుకంటే బాలయ్య హైదరాబాద్ లో యూనివర్సిటీ పేరు మార్పు మీద మీడియా (Media conference) తో మాట్లాడే ఛాన్స్ వుంది అని అంటున్నారు. లేకపోతే తన నియోజక వర్గం అయిన హిందూపూర్ (Hindupur) లో మీటింగ్స్ పెట్టి దాని గురించి మాట్లాడే అవకాశం వుంది అని అంటున్నారు. ఎందుకంటే ఇది బాలకృష్ణ కి వ్యక్తిగతంగానూ (Personal) అలాగే రాజకీయంగానూ (Political) కూడా ముడిపడి వుంది కాబట్టి కచ్చితంగా మాట్లాడతాడు అని అంటున్నారు. అలాగే అతను తన రియాలిటీ షో (Reality show) రెండో సీజన్ (second season) కూడా  మొదలెడుతున్నాడు,అందులో ఎవరు అతిధులు (Guests) అన్నది కూడా బాలకృష్ణ ఫైనల్ చేస్తాడని తెలిసింది. 

Updated Date - 2022-09-24T21:01:14+05:30 IST