Bala Krishna: అదే జరిగితే.. ప్యాన్‌ వరల్డ్‌ సినిమా అవుతుంది!

ABN , First Publish Date - 2022-12-01T22:45:51+05:30 IST

అన్‌స్టాపబుల్‌ షోతో దూసుకెళ్తున్నారు నందమూరి బాలకృష్ణ. చిన్న, పెద్ద తారతమ్యం లేకుండా ఎలాంటి సెలబ్రిటీ అతిథిగా వచ్చిన ఆయన తరహా ప్రశ్నలతో ఇరకాటంలో పడేస్తున్నారు. ప్రేక్షకుల్ని వినోదాన్ని పంచుతున్నారు. తాజాగా టాలీవుడ్‌కి అగ్ర నిర్మాతలైన అల్లు అరవింద్‌, డి సురేశ్‌బాబు ‘అన్‌స్టాపబుల్‌ 2’ షోకు అతిథులుగా ఆహ్వానించారు.

Bala Krishna: అదే జరిగితే.. ప్యాన్‌ వరల్డ్‌ సినిమా అవుతుంది!

అన్‌స్టాపబుల్‌ (unstoppable season 2)షోతో దూసుకెళ్తున్నారు నందమూరి బాలకృష్ణ(Bala krishna). చిన్న, పెద్ద తారతమ్యం లేకుండా ఎలాంటి సెలబ్రిటీ అతిథిగా వచ్చిన ఆయన తరహా ప్రశ్నలతో ఇరకాటంలో పడేస్తున్నారు. ప్రేక్షకుల్ని వినోదాన్ని పంచుతున్నారు. తాజాగా టాలీవుడ్‌కి అగ్ర నిర్మాతలైన అల్లు అరవింద్‌(Allu aravind), డి సురేశ్‌బాబు (D sureshbabu) ‘అన్‌స్టాపబుల్‌ 2’ షోకు అతిథులుగా ఆహ్వానించారు. బాలయ్య హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ కార్యక్రమంలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. దీనికి సంబంధించిన ప్రోమోను ‘ఆహా’ ఓటీటీ విడుదల చేసింది. ‘సురేశ్‌బాబుతో నాకున్న అనుబంధం గురించి మీకు తెలుసు. కానీ మన ఇద్దరి కాంబినేషన్‌ ఒకటే పెండింగ్‌ ఉంది’ అని బాలయ్య అల్లు అరవింద్‌ను అడగగా, ‘చిరంజీవిగారు, (Chiranjeevi - Balakrishna combo movie) మీ కాంబినేషన్‌ సినిమా తీయాలనే ఇప్పటి దాకా వెయిట్‌ చేశా’ అని అరవింద్‌ సమాధానమిచ్చారు. ఆ సమాధానం విన్న ఆడియోన్స్‌ కేరింతలతో సందడి చేశారు. దానికి బాలకృష్ణ స్పందిస్తూ.. ‘మేమిద్దరం చేసే ప్యాన్‌ వరల్డ్‌ సినిమా అవుతుంది’ అని బాలకృష్ణ అన్నారు. మీరు(అల్లు అరవింద్‌) బన్నీతో, మీరు(సురేశ్‌బాబు) వెంకీతో ఎలా వేగుతున్నారనే ప్రశ్నకు ‘చెప్పుకోలేని కష్టాలు కొన్ని ఉంటాయండీ అని అరవింద్‌ చెప్పారు. 


తెలుగు సినిమా ప్రత్యేకత గురించి ఇరు నిర్మాతలు గొప్పగా చెప్పుకొచ్చారు. తెలుగు సినిమా ప్రత్యేకత ఏంటనే ప్రశ్నకు... తెలుగు సినిమా థాలీ మీల్స్‌ లాంటిది. 100, 150 ఖర్చు చేసి టికెట్‌ కొనే ఆడియన్స్‌కి ఆత్మ సంతృప్తి కలిగించి థియేటర్‌ బయటకు పంపుతాం. అందుకే తెలుగు సినిమా చాలా స్పెషల్‌’’ అని అల్లు అరవింద్‌, సురేశ్‌బాబు చెప్పుకొచ్చారు. 


Updated Date - 2022-12-01T22:45:51+05:30 IST

Read more