సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

పాన్‌ వరల్డ్‌ స్థాయిలో... ‘ఆదిపురుష్‌’

ABN, First Publish Date - 2022-01-29T10:55:31+05:30

‘బాహుబలి’తో ప్రభాస్‌ పాన్‌ ఇండియా స్టార్‌ అయిపోయారు. ‘ఆదిపురుష్‌’తో పాన్‌ వరల్డ్‌ స్టార్‌గా అవతరించబోతున్నారు. అవును... ‘ఆదిపురుష్‌’తో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు కూడా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘బాహుబలి’తో ప్రభాస్‌ పాన్‌ ఇండియా స్టార్‌ అయిపోయారు. ‘ఆదిపురుష్‌’తో పాన్‌ వరల్డ్‌ స్టార్‌గా అవతరించబోతున్నారు. అవును... ‘ఆదిపురుష్‌’తో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు కూడా పరిచయం కాబోతున్నారు ప్రభాస్‌. ఓం రౌత్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. ప్రభాస్‌ రాముడిగా కనిపించనున్నారు. కృతిసనన్‌, సైఫ్‌ అలీఖాన్‌ కీలక పాత్రధారులు. ఈ చిత్రాన్ని ఇంగ్లీషులో కూడా విడుదల చేయాలని ‘ఆదిపురుష్‌’ బృందం భావిస్తోంది. ఈ మేరకు డిస్నీ స్డూడియోస్‌తో ఒప్పందం కుదుర్చుకుంటున్నారని తెలుస్తోంది. భారతీయ భాషలతో కాకుండా, మరో పది అంతర్జాతీయ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. అందుకోసం దాదాపు 20 వేల థియేటర్లని సిద్ధం చేస్తున్నార్ట. అదే నిజమైతే... ఓ భారతీయ చిత్రానికి దక్కిన అతి పెద్ద రిలీజ్‌ అవుతుంది.  సుమారు రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని రూపొందించారు. షూటింగ్‌ పూర్తయ్యింది. ప్రస్తుతం విఎఫ్‌ఎక్స్‌కి సంబంధించిన పనులు జరుగుతున్నాయి.


Updated Date - 2022-01-29T10:55:31+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!