సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

తెలంగాణ సమాజానికి చిన్నజియర్ క్షమాపణలు చెప్పాలి : అశ్వనీదత్

ABN, First Publish Date - 2022-03-17T21:26:17+05:30

గతంలో చిన్న జియర్ స్వామి ప్రముఖ టీవీలో చెప్పిన ప్రవచనాల వీడియో.. ఇప్పుడు వివాస్పదంగా మారింది. సోషల్ మీడియాలో ఈ వీడియోను తెగ వైరల్ చేస్తూ ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నారు. అందులో గిరిజన దేవతా మూర్తులైన సమ్మక్క సారక్కలపై ఆయన తీవ్రంగా విమర్శించారు. ‘వాళ్లేమైనా దేవతలా? బ్రహ్మలోకం నుంచి దిగి వచ్చిన వాళ్ళా ? ఏమిటీ చరిత్ర? వారిపై బ్యాంకులే పెట్టేసి వ్యాపారం చేస్తున్నారు’ అని అందులో తెలిపారు. దానిపై తెలంగాణ ఆదివాసి గిరిజన సంక్షేమ సంఘాలు మండిపడ్డాయి. ఆదివాసి గిరిజనులకు చిన్నజియర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గతంలో చిన్న జియర్ స్వామి ప్రముఖ టీవీ ఛానల్ లో చెప్పిన ప్రవచనాల వీడియో.. ఇప్పుడు వివాస్పదంగా మారింది. సోషల్ మీడియాలో ఈ వీడియోను తెగ వైరల్ చేస్తూ ఆయనపై  విమర్శలు గుప్పిస్తున్నారు. అందులో గిరిజన దేవతా మూర్తులైన సమ్మక్క సారక్కలపై ఆయన తీవ్రంగా విమర్శించారు. ‘వాళ్లేమైనా దేవతలా? బ్రహ్మలోకం నుంచి దిగి వచ్చిన వాళ్ళా ? ఏమిటీ చరిత్ర? వారిపై బ్యాంకులే పెట్టేసి వ్యాపారం చేస్తున్నారు’ అని అందులో తెలిపారు. దానిపై తెలంగాణ ఆదివాసి గిరిజన సంక్షేమ సంఘాలు మండిపడ్డాయి. ఆదివాసి గిరిజనులకు చిన్నజియర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఆయనపై యస్సీ, యస్టీ అట్రాసిటీ కేసులు కూడా నమోదు చేయాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ పోలీసులకు పిర్యాదు చేసింది. 


ఈ నేపథ్యంలో చిన్నజియర్ వ్యాఖ్యలపై ప్రముఖ టాలీవుడ్ నిర్మాత సి.అశ్వనీదత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన విమర్శలు చాలా బాధ కలిగించాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన గత చరిత్ర అందరికీ తెలుసని, గతంలో బ్లాక్ టికెట్లు అమ్ముకొనే వాడని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సమాజానికి చిన్నజియర్ క్షమాపణ చెప్పాలని అశ్వనీదత్ డిమాండ్ చేశారు. 

Updated Date - 2022-03-17T21:26:17+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!