Vishwaksen : ‘ఆహా’ లో అర్జున కళ్యాణం .. వచ్చేది అప్పుడే !

ABN , First Publish Date - 2022-05-08T14:29:27+05:30 IST

యంగ్ హీరో విశ్వక్ సేన్ (Vishwaksen) లేటెస్ట్ మూవీ ‘అశోకనంలో అర్జున కళ్యాణం’. ఇటీవలే థియేటర్స్‌లో విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. విద్యాసాగర్ చింతా (Vidyasagar Chintha) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను యస్వీసీసీ డిజిటల్ బ్యానర్ పై బాపినీడు, సుధీర్ ఈదర సంయుక్తంగా నిర్మించారు. మాస్ కా దాస్ అనిపించుకొనే విశ్వక్ సేన్ (Vishwaksen) తన కెరీర్ లోనే తొలిసారిగా నటించిన ఫ్యామిలీ డ్రామా ఇది.

Vishwaksen : ‘ఆహా’ లో అర్జున కళ్యాణం .. వచ్చేది అప్పుడే !

యంగ్ హీరో విశ్వక్ సేన్ (Vishwaksen) లేటెస్ట్ మూవీ ‘అశోకనంలో అర్జున కళ్యాణం’. ఇటీవలే థియేటర్స్‌లో విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది.  విద్యాసాగర్ చింతా (Vidyasagar Chintha) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను యస్వీసీసీ డిజిటల్ బ్యానర్ పై బాపినీడు, సుధీర్ ఈదర సంయుక్తంగా నిర్మించారు. మాస్ కా దాస్ అనిపించుకొనే విశ్వక్ సేన్ (Vishwaksen) తన కెరీర్ లోనే తొలిసారిగా నటించిన ఫ్యామిలీ డ్రామా ఇది. ముప్పై ఏళ్ళొచ్చినా ఇంకా పెళ్ళికాని అల్లం అర్జున్ కుమార్‌కు ఒక అందమైన అమ్మాయితో పెళ్ళి కుదురుతుంది. అయితే లాక్ డౌన్ కారణంగా మగపెళ్ళివారు ఆడపెళ్ళివారింట్లో ఉండిపోవాల్సి వస్తుంది. అప్పుడు జరిగే అనూహ్య సంఘటనల సమాహారమే ఈ సినిమా. చక్కటి కామెడీ, ఎంచక్కటి ఎమోషన్స్ ఈ సినిమా విజయానికి మూలస్థంభాలుగా నిలిచాయి. అయితే ఇలా రిలీజ్ అయిందో లేదో అప్పుడే ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుండడం విశేషం. 


‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ (Ashokavanam lo Arjunakalyanam) చిత్రానికి ఆహా (Aha) ఓటీటీ సంస్థ స్ట్రీమింగ్ పార్టనర్ అన్న విషయం తెలిసిందే. వచ్చేనెల మొదటి వారంలో ఈ సినిమా స్ట్రీమింగ్‌కు రెడీ కానుంది. త్వరలోనే ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్ ను అధికారికంగా ప్రకటించబోతున్నారు. మే 6న విడుదలైన ఈ సినిమాకి మొదటి రోజు వసూళ్ళు చెప్పుకోదగ్గ స్థాయిలోనే నమోదయ్యాయి. విడుదలకు ముందు ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో జరిగిన రచ్చ, హీరో విశ్వక్ సేన్ (Vishwaksen) వినూత్న రీతిలో చేపట్టిన ప్రచారాలు సినిమా విజయానికి ప్రధాన కారణమయ్యాయి. దానికి తగ్గట్టుగానే కంటెంట్ కూడా బాగుండడంతో ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమా చూడడానికి మంచి ఆసక్తి చూపిస్తున్నారు. 


రుక్సార్ థిల్లాన్ (Ruksar thillan)  కథానాయికగా నటించిన ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ (Ashokavanam lo Arjunakalyanam) చిత్రంలో ఇంకా గోపరాజు రమణ, రితికా నాయక్, కేదార్, వెన్నెల కిషోర్, కాదంబరి కిరణ్ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. జయక్రిష్ సంగీతం అందించగా.. పవి కె పవన్ ఛాయగ్రహణం నిర్వహించారు. కథ స్ర్కీన్ ప్లే మాటల్ని రవికిరణ్ కోలా అందించారు.  ప్రస్తుతం థియేటర్స్‌లో బాగానే సత్తా చాటుతున్న ఈ సినిమాకి ఓటీటీలో ప్రేక్షకులు ఇంకెంతటి ఆదరణ అందిస్తారో చూడాలి. 

Updated Date - 2022-05-08T14:29:27+05:30 IST