కాశీ ప్రయాణం కథగా...
ABN , First Publish Date - 2022-12-06T07:05:15+05:30 IST
చైతన్యరావు, అలెగ్జాండర్ సాల్నికోవ్, ప్రియా పాల్వాయి, ఖ్యాతిలీన్ గౌడ ప్రధాన తారాగణంగా రూపొందుతున్న చిత్రం ‘ఏ జర్నీ టు కాశీ’...

చైతన్యరావు, అలెగ్జాండర్ సాల్నికోవ్, ప్రియా పాల్వాయి, ఖ్యాతిలీన్ గౌడ ప్రధాన తారాగణంగా రూపొందుతున్న చిత్రం ‘ఏ జర్నీ టు కాశీ’. ముని కృష్ణ దర్శకత్వంలో దొరడ్ల బాలాజీ, శ్రీధర్ వారణాసి నిర్మించారు. డిసెంబరు 17న విడుదలవుతోంది. ఆదివారం ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ‘మా చిత్రం పనోరమా ఫిల్మ్ ఫెస్టివల్‌లో టాప్ 25 లిస్ట్‌లో నిలిచింది’ అని చైతన్య రావు అన్నారు. ‘ఇది ఒక రోడ్ జర్నీ కథ. కాశీ యాత్ర కొంతమంది జీవితాల్లో ఎలాంటి మార్పు తెచ్చిందనేది ఆసక్తికరంగా ఉంటుంద’ని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: ఫణి కల్యాణ్.