OHRK: మోహన్‌బాబు చెయ్యి చేసుకున్నాడా?

ABN , First Publish Date - 2022-12-12T23:55:29+05:30 IST

‘‘నా జీవితం తెరచిన పుస్తకం లాంటిది. నాకు రహస్యాలు ఏమీ ఉండవు. ఏదైనా మనసుతోనే మాట్లాడతాను’’ అని సీనియర్‌ నటుడు బెనర్జీ అన్నారు. చిన్నప్పటి సినిమా అంటే ఇష్టం, ప్యాషన్‌ కల ఇలాంటివి ఏమీ లేకుండా సినిమాల్లోకి వచ్చిన ఆయన వైవిధ్యమైన పాత్రలతో 40 ఏళ్లుగా ప్రేక్షకులను అలరిస్తున్నారు.

OHRK: మోహన్‌బాబు చెయ్యి చేసుకున్నాడా?

‘‘నా జీవితం తెరచిన పుస్తకం లాంటిది. నాకు రహస్యాలు ఏమీ ఉండవు. ఏదైనా మనసుతోనే మాట్లాడతాను’’ అని సీనియర్‌ నటుడు బెనర్జీ ( Banerjee )అన్నారు. చిన్నప్పటి సినిమా అంటే ఇష్టం, ప్యాషన్‌ కల ఇలాంటివి ఏమీ లేకుండా సినిమాల్లోకి వచ్చిన ఆయన వైవిధ్యమైన పాత్రలతో 40 ఏళ్లుగా ప్రేక్షకులను అలరిస్తున్నారు. తాజాగా ఆయన ‘ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే’(Open heart with RK) కార్యక్రమంలో పాల్గొన్నారు.

బెనర్జీ సినిమాల్లోకి ఎలా వచ్చారు.. 

డైరెక్షన్‌ టు ఆర్టిస్ట్‌ ఎలా టర్న్‌ అయ్యాడు...

అందులో అమితాబ్‌ బచ్చన్‌ పాత్ర ఏంటి? 

సినిమాల జోలికి పోకూడదని ఎందుకు అనుకున్నారు? 

తెలుగు ఆర్టిస్టుల్లో ప్రతిభ లేదా? 

పరభాష నటుల్ని ఎందుకు తీసుకొస్తున్నారు? 

‘మా’ ఎన్నికల విషయంలో జరిగిన రచ్చ ఏంటి? 

మోహన్‌బాబు చెయ్యి చేసుకున్నాడా? 

బెనర్జీ కన్నీటికి కారణమేంటి? 

ఇటువంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానమిచ్చారు. 


‘ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే’ అంటే నాకెంతో ఇష్టం. నేను అడిగి ఈ ఇంటర్వ్యూ చేయించుకోవాలన్న కోరిక ఉండేది. 

 

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ను మంచి దార్లో పెట్టాలని చిరంజీవి కాస్త ఇన్‌వాల్వ్‌ అయ్యారు. ప్రకాశ్‌ రాజ్‌ అధ్యక్షుడిగా పోటీ చేస్తాడని చిరంజీవి ఫోన్‌లో చెప్పారు. ప్రకాశ్‌ బరిలో ఉంటాడని తెలిసి, కొంత సమయం తీసుకుని సడెన్‌గా మోహన్‌బాబుగారు విష్ణుని ప్రకటించారు. 


కన్నడలో బుక్‌ చేసిన ఆర్టిస్ట్‌ రాకపోవడంతో అక్కడే ఉన్న అమితాబ్‌ బచ్చన్‌ గారు.. ‘అరే చొడేయార్‌.. ఉస్కో బెనర్జీ కర్లేగా’ అన్నారు. అలా నేను నటుడినయ్యా. అందులో శ్రీదేవితో చేసిన నాలుగు సీన్ల గురించి మాటిమాటికీ చెబుతుంటే మా అమ్మాయి ఊరుకోవడం లేదు. నా ఫ్రెండ్స్‌ అయితే శ్రీదేవిని తాకిన చేతులివి అంటూ నా చేతులు పట్టుకునేవారు. 


ఇప్పటి వరకూ ఎన్ని చిత్రాల్లో నటించాను అన్నది లెక్కపెట్టుకోను. నా ఇంట్లో సినిమాకు సంబంధించిన షీల్డ్‌లు కూడా పెట్టుకోలేదు అది బ్యాడ్‌ హ్యాబిట్‌. 


50 ఏళ్ల వయసులో సిగిరెట్‌ స్టార్ట్‌ చేశాను. ఫ్యాన్సీ స్మోకర్‌.. ఐ డోంట్‌ ఇన్‌ హీల్‌. 


మన దగ్గర టాలెంట్‌ లేదనే భావనలో ఉన్నారు కాబట్టే క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌లను కూడా ఇతర భాషల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. నేను పనికి రాననే ఇంకొకరిని తీసుకొస్తున్నారు. 




Updated Date - 2022-12-12T23:55:29+05:30 IST