సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

మానవ సంబంధాలకు ‘అర్థం’

ABN, First Publish Date - 2022-08-20T05:30:00+05:30

హీరోయిన్‌ శ్రద్ధాదాస్‌ ప్రధాన పాత్ర పోషిస్తున్న తెలుగు, తమిళ చిత్రం ‘అర్థం’. సెప్టెంబరులో ప్రేక్షకుల ముందుకు రానుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హీరోయిన్‌ శ్రద్ధాదాస్‌ ప్రధాన పాత్ర పోషిస్తున్న తెలుగు, తమిళ చిత్రం ‘అర్థం’. సెప్టెంబరులో ప్రేక్షకుల ముందుకు రానుంది. సైకలాజిక ల్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కుతోంది. మహేంద్రన్‌, ఆమని, అజయ్‌ కీలకపాత్రలు పోషించారు. మణికాంత్‌ తెల్లగూటి దర్శకుడు. రాధికా శ్రీనివాస్‌ నిర్మాత. శుక్రవారం చిత్రబృందం టీజర్‌ను విడుదల చేసింది. ఈ సందర్భంగా శ్రద్ధాదాస్‌ మాట్లాడుతూ ‘ఈసినిమా నాకు చాలా స్పెషల్‌, మాయ అనే మానసిక వైద్య నిపుణురాలి పాత్రను పోషిస్తున్నాను’ అన్నారు. ‘అర్థం’ సినిమా ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేస్తుందని నిర్మాత అన్నారు. మానవ సంబంధాల నేపథ్యంలో వినోదాత్మకంగా ‘అర్థం’ సినిమాను రూపొందిస్తున్నామని చిత్ర దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: హర్షవర్ధన్‌ రామేశ్వర్‌. సినిమాటోగ్రఫీ: పవన్‌ చెన్నా. 

Updated Date - 2022-08-20T05:30:00+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!