Pranav Mohanlal: విశ్వక్ సేన్ ప్లేస్ లో మోహన్ లాల్ తనయుడు ప్రణవ్
ABN , First Publish Date - 2022-11-08T18:03:30+05:30 IST
నటుడు, దర్శకుడు, నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ అయిన యాక్షన్ కింగ్ అర్జున సర్జ తెలుగులో మొదటి సారిగా దర్శకత్వం వహిస్తూ విశ్వక్ సేన్ ని లీడ్ యాక్టర్ సినిమా చెయ్యాలి అనుకున్నాడు.

నటుడు, దర్శకుడు, నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ అయిన యాక్షన్ కింగ్ అర్జున సర్జ తెలుగులో మొదటి సారిగా దర్శకత్వం వహిస్తూ విశ్వక్ సేన్ ని లీడ్ యాక్టర్ సినిమా చెయ్యాలి అనుకున్నాడు. (Actor-producer -director Arjun Sarja sacked Vishwak Sen from his project and now planning to rope in Malayalam Superstar Mohanlal's son Pravan) కానీ ప్రీ-ప్రొడక్షన్ అంత అయింది, షూటింగ్ సరిగ్గా మొదలయ్యే రోజు ఇద్దరి మధ్య కొంత సమాచారం లోపంతో, విశ్వక్ సేన్ కమిట్మెంట్ లేని యాక్టర్ అని విమర్శిస్తూ అతనితో సినిమా చెయ్యను అని అతన్ని ఆ ప్రాజెక్ట్ నుండి తీసేస్తున్నట్టు అర్జున్ చెప్పేసాడు. వేరే వాళ్ళతో ఆ సినిమా చేస్తాను అని కూడా చెప్పాడు.
అయితే ఇప్పుడు తాజా గా అందిన సమాచారం ప్రకారం, అర్జున్ ఈ ప్రాజెక్ట్ కోసం మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ తనయుడు ప్రణవ్ ని అడుగుదామని అనుకుంటున్నట్టుగా తెలిసింది. తెలుగులో నటులు అందరూ బిజీ గా ఉండటం తో, మోహన్ లాల్ తనయుడిని తెలుగులో ఇంట్రడ్యూస్ చేసినట్టు ఉంటుందని, అలాగే అతన్ని పెట్టుకుంటే అది మల్టీ-లాంగ్వేజ్ ప్రాజెక్ట్ అవుతుందని, అర్జున్ భావిస్తున్నదని తెలిసింది. అర్జున్ కేరళ వెళ్లి మోహన్ లాల్ ని అడగాలని అనుకుంటున్నట్టు తెలిసింది. ప్రణవ్ సినిమా 'హృదయం' ఈమధ్య తెలుగు ప్రేక్షకులకి కూడా బాగా నచ్చింది, తెలుగు ప్రేక్షకులకు దగ్గర చేసింది కూడా ఆ సినిమా. అర్జున్ కూతురు ఐశ్వర్య ఈ సినిమాతో తెలుగులో పరిచయం కావాల్సి వుంది. ఇప్పుడు విశ్వక్ సేన్ ని తప్పించటం తో, ఈ సినిమా కొంచెం టైం పట్టినా, అర్జున్ తొందరగానే పూర్తి చెయ్యాలని చూస్తున్నాడు. ఎందుకంటే అతని దగ్గర స్క్రిప్ట్ మొత్తం కంప్లీట్ అయి వుంది. మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరూ రెడీ గా వున్నారు. ఒక్క లీడ్ యాక్టర్ నే సెలెక్ట్ చేసుకోవాలి, అని తెలిసింది. (#ArjunSarja #VishwakSen #PranavMohanlal #Mohanlal #AishwaryaArjun)
