సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

శత్రువు ఎవరు?

ABN, First Publish Date - 2022-06-25T07:07:44+05:30

అనసూయ భరద్వాజ్‌, సాయికుమార్‌, వైవా హర్ష, శుభలేఖ సుధాకర్‌ ప్రధాన తారాగణంగా తెరకెక్కుతోన్న

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనసూయ భరద్వాజ్‌, సాయికుమార్‌, వైవా హర్ష, శుభలేఖ సుధాకర్‌ ప్రధాన తారాగణంగా తెరకెక్కుతోన్న నూతన చిత్రం ‘అరి’. ‘పేపర్‌బాయ్‌’ చిత్రంతో హిట్‌ అందుకున్న జయశంకర్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. శేషు మారం రెడ్డి, శ్రీనివాస్‌ రామిరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈచిత్రం టైటిల్‌ లోగోను శుక్రవారం హుజూరాబాద్‌ ఎం.ఎల్‌.ఎ శానంపూడి సైదిరెడ్డి, నిర్మాత మిర్యాల రవీందర్‌ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు మాట్లాడుతూ ‘కథకు చక్కగా నప్పుతుందని ‘అరి’ టైటిల్‌ పెట్టాం. సంస్కృతంలో ‘అరి’ అంటే శత్రువు అని అర్థం. ఈ చిత్రం దర్శకుడిగా నాకు మంచి పేరు తెస్తుంది’ అన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ ‘మా సినిమాలో మనుషులు ఎలా బతకగూడదో చూపిస్తాం. అనూప్‌ రూబెన్స్‌ మంచి ట్యూన్లు ఇచ్చారు’ అన్నారు. 

Updated Date - 2022-06-25T07:07:44+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!