DJ Tillu 2: అనుపమ పరమేశ్వరన్ ఔట్.. కొత్త హీరోయిన్ ఎవరంటే..?
ABN , First Publish Date - 2022-11-29T20:50:47+05:30 IST
చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన సినిమా ‘డీజే టిల్లు’ (DJ Tillu). సిద్ధు జొన్నల గడ్డ (Siddu Jonnalagadda), నేహా శెట్టి (Neha Shetty) హీరో, హీరోయిన్గా నటించారు.

లో బడ్జెట్లో రూపొంది బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన సినిమా ‘డీజే టిల్లు’ (DJ Tillu). సిద్ధు జొన్నల గడ్డ (Siddu Jonnalagadda), నేహా శెట్టి (Neha Shetty) హీరో, హీరోయిన్గా నటించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్య దేవర నాగవంశీ నిర్మించారు. విమల్ కృష్ణ (Vimal Krishna) దర్శకత్వం వహించిన ఈ చిత్రం భారీ వసూళ్లను సాధించింది. అందువల్ల మేకర్స్ సీక్వెల్ రూపొందిస్తున్నట్టు ప్రకటించారు. దీపావళి కానుకగా టైటిల్ అనౌన్స్ చేశారు. సినిమాకు ‘టిల్లు స్వ్కేర్’ (Tillu Square) అని టైటిల్ పెట్టారు.
‘డీజే టిల్లు’ సీక్వెల్ ‘టిల్లు స్వ్కేర్’ కు ఆది నుంచి కష్టాలు వెంటాడుతున్నాయి. సీక్వెల్ డైరెక్షన్ నుంచి విమల్ కృష్ణ తప్పుకొన్నాడు. ఫలితంగా వేరే దర్శకుడు ‘టిల్లు స్క్వేర్’ ను డైరెక్ట్ చేస్తున్నాడు. సినిమాను ప్రారంభించినప్పుడు మొదటగా శ్రీ లీల (Sreeleela) ను హీరోయిన్గా అనుకున్నారు. ఏమైందో తెలియదు కానీ ఈ చిత్రం నుంచి ఆమె తప్పుకొంది. శ్రీ లీల ప్లేస్‌లోకి అనంతరం అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) వచ్చింది. తాజాగా అనుపమ కూడా తప్పుకొన్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు తెలుపుతున్నాయి. డేట్స్ ఇష్యూ వల్ల అనుపమ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకొన్నట్టు సమాచారం. అనుపమ స్థానంలో తాజాగా మడొన్నా సెబాస్టియన్ (Madonna Sebastian) ను హీరోయిన్గా తీసుకున్నారని రూమర్స్ హల్చల్ చేస్తున్నాయి. నాగ చైతన్య నటించిన ‘ప్రేమమ్’ తో మలయాళీ బ్యూటీ మడొన్నా తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ‘శ్యామ్ సింగరాయ్’ లో లాయర్ పాత్రను పోషించింది. తమిళ్లోను అనేక సినిమాలు చేసింది. ‘టిల్లు స్వ్కేర్’ పై భారీ బజ్ ఉంది. ఆ అంచనాలను అందుకోవాలని మేకర్స్ ప్రయత్నిస్తున్నారు. ఈ సినిమాకు మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. వచ్చే ఏడాది మార్చిలో మూవీని విడుదల చేస్తామని నిర్మాతలు ప్రకటించారు.