Anupama parameswaran: ఆయన గురించి మాట్లాడే స్థాయికి ఎదగలేదు!

ABN , First Publish Date - 2022-06-12T21:48:06+05:30 IST

మలయాళీ కుట్టి అనుపమ పరమేశ్వరన్‌ మహా అల్లరి పిల్ల. సోషల్‌ మీడియాలో ఆమె ఫొటోలు చూస్తేనే ఆ విషయం అర్థమవుతుంది. అలాగే కథల ఎంపికలోనూ ఆచితూచి అడుగులేస్తుందీ బ్యూటీ. ప్రస్తుతం అనుసమ చేతిలో ‘18 పేజెస్‌’, ‘కార్తికేయ 2’, ‘బటర్‌ ఫ్లై’ చిత్రాలున్నాయి. ‘బటర్‌ ఫ్లై’ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో పవన్‌ కల్యాణ్‌ గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.

Anupama parameswaran: ఆయన గురించి మాట్లాడే స్థాయికి ఎదగలేదు!

మలయాళీ కుట్టి అనుపమ పరమేశ్వరన్‌ (Anupama parameswaran)మహా అల్లరి పిల్ల. సోషల్‌ మీడియాలో ఆమె ఫొటోలు చూస్తేనే  ఆ విషయం అర్థమవుతుంది. అలాగే కథల ఎంపికలోనూ ఆచితూచి అడుగులేస్తుందీ బ్యూటీ. ప్రస్తుతం అనుసమ చేతిలో ‘18 పేజెస్‌’, ‘కార్తికేయ 2’, ‘బటర్‌ ఫ్లై’ చిత్రాలున్నాయి. ‘బటర్‌ ఫ్లై’ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో పవన్‌ కల్యాణ్‌ గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. పవన్‌కల్యాణ్‌తో సినిమా ఎప్పుడు చేస్తారు? ఆయనపై మీ అభిప్రాయం ఏంటి అన్న ప్రశ్నకు ‘‘పవన్‌కల్యాణ్‌ గారి గురించి చెప్పే స్థాయికి నేను ఎదగలేదు. ఆయన చాలా పెద్ద స్టార్‌. ఆయన నటించిన సినిమాలు చూసి, వ్యక్తిత్వం గురించి తెలుసుకుని పవర్‌స్టార్‌కు అభిమానిని అయిపోయా. ‘భీమ్లానాయక్‌’ సినిమా విడుదలైనప్పుడు ‘బటర్‌ఫ్లై’ హీరో నిహాల్‌తో కలిసి ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో సుదర్శన్‌ థియేటర్‌లో చూశా. అక్కడ నన్ను ఎవరు గుర్తు పట్టకుండా ఆ రోజు బురఖా వేసుకుని వెళ్లి ఆ సినిమా చూసొచ్చా’’ అని అనుసమా పరమేశ్వరన్‌ చెప్పుకొచ్చారు. (Anupama parameswaran about Pawan kalyan)


ఇంకా మాట్లాడుతూ ‘‘ఒకప్పుడు ట్రోలింగ్‌ అంటే భయపడేదాన్ని. ఇప్పుడు దాని గురించి అసలు పట్టించుకోవడం లేదు. మలయాళంలో నా మొదటి సినిమా విడుదలైనప్పుడు విపరీతంగా ట్రోల్‌ చేశారు. అవన్నీ చూసి ఏడుపు ఆగలేదు. ఇప్పుడు కొంతమంది చేసే ట్రోల్‌ను, మీమ్స్‌ను ఎంజాయ్‌ చేస్తున్నా’’ అని అన్నారు. 


Updated Date - 2022-06-12T21:48:06+05:30 IST