Ante Sundaraniki: సెన్సార్ పూర్తి..

ABN , First Publish Date - 2022-06-04T19:39:39+05:30 IST

నేచురల్ స్టార్ నాని (Natural Star Nani), నజ్రియా ఫహద్ (Nazriya Fahadh) జంటగా నటించిన తాజా చిత్రం ‘అంటే సుందరానికీ’ (Ante Sundaraniki).

Ante Sundaraniki: సెన్సార్ పూర్తి..

నేచురల్ స్టార్ నాని (Natural Star Nani), నజ్రియా ఫహద్ (Nazriya Fahadh) జంటగా నటించిన తాజా చిత్రం ‘అంటే సుందరానికీ’ (Ante Sundaraniki). ఈ మూవీకి సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. వివేక్ ఆత్రేయ (Vivek Athreya) దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) నిర్మించారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా జూన్ 10న ప్రపంచ వ్యాప్తంగా మూడు భాషల్లో ఒకేసారి విడుదలకాబోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్రానికి సెన్సార్ కార్యక్రామలను పూర్తి చేసుకొని క్లీన్ యూ సర్టిఫికెట్‌ను పొందింది.


ఈ విషయాన్ని మేకర్స్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఇక చిత్రయూనిట్ ప్రమోషన్స్‌లో భాగంగా ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇప్పటికే విడుదలైన టీజర్, లిరికల్స్ సాంగ్స్ ప్రేక్షకుల నుండి మంచి స్పందనను రాబట్టుకోగా.. తాజాగా విడుదలైన ట్రైలర్‌.. సినిమాపై మరింతగా అంచనాలను పెంచేసింది. సుందర్, లీలా థామస్ పాత్రలో నాని, నజ్రియాల ప్రేమకథ అన్నీ వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవడం గ్యారెంటీ అనేలా ఉంది ట్రైలర్. వివేక్ సాగర్ (Vivek Sagar) సంగీతం అందించారు.


కాగా, ఈ చిత్రం తమిళ్‌లో ‘అడాడే సుందరా’ (Adade Sundara) అనే టైటిల్‌తోనూ, మలయాళంలో ‘ఆహా సుందరా’ (Aha Sundara) అనే టైటిల్‌తో విడుదలవుతోంది. గత ఏడాది చివర్లో ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాతో వచ్చి సూపర్ హిట్ అందుకున్న నాని, ఆ సినిమాకు పూర్తి భిన్నంగా ‘అంటే సుందరానికీ’ సినిమాతో వస్తున్నాడు. కంప్లీట్ కామెడీ ఎంటర్‌టర్‌గా రాబోతున్న ఈ సినిమా నానికి ఎలాంటి సక్సెస్ ఇస్తుందో చూడాలి. ఇక ఈ నేచురల్ స్టార్ ప్రస్తుతం ‘దసరా’ సినిమాలో నటిస్తున్నాడు. పాన్ ఇండియా మూవీగా శ్రీకాంత్ ఒదెల తెరకెక్కిస్తున్నాడు. కీర్తి సురేష్ హీరోయిన్. 



Updated Date - 2022-06-04T19:39:39+05:30 IST