సంక్రాంతి బరిలోకి మరో అనువాద చిత్రం

ABN , First Publish Date - 2022-12-22T04:38:38+05:30 IST

వచ్చే సంక్రాంతికి మూడు భారీ చిత్రాలు విడుదల కానున్నాయి. వీటిల్లో మెగాస్టార్‌ చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’, బాలకృష్ణ నటించిన ‘వీరసింహారెడ్డి’ స్ట్రెయిట్‌ చిత్రాలు కాగా...

సంక్రాంతి బరిలోకి మరో అనువాద చిత్రం

వచ్చే సంక్రాంతికి మూడు భారీ చిత్రాలు విడుదల కానున్నాయి. వీటిల్లో మెగాస్టార్‌ చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’, బాలకృష్ణ నటించిన ‘వీరసింహారెడ్డి’ స్ట్రెయిట్‌ చిత్రాలు కాగా, తమిళ హీరో విజయ్‌ నటించిన ‘వారసుడు’ డబ్బింగ్‌ చిత్రం. ఇప్పుడు వీటికి తోడు మరో భారీ అనువాద చిత్రం ‘తెగింపు’ బరిలోకి దిగనుంది. తమిళ హీరో అజిత్‌ నటించిన ‘తునివు’ సినిమా ‘తెగింపు’ పేరుతో తెలుగులోకి విడుదల కానుంది. సంక్రాంతి పోటీలో పాల్గొంటున్నట్లు వెల్లడిస్తూ నిర్మాతలు ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. రాధాకృష్ణ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఐవీవై ప్రొడక్షన్స్‌ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని రెండు రాష్ట్రాల్లో విడుదల చేయనున్నాయి. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామని తెలిపాయి. హెచ్‌.వినోద్‌ దర్శకత్వంలో బోనీ కపూర్‌ జీ స్టూడియోతో కలసి ఈ చిత్రాన్ని నిర్మించారు.

Updated Date - 2022-12-22T04:38:43+05:30 IST

Read more